బిజినెస్

పీఎన్‌బీ రేటింగ్ తగ్గించిన మూడీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్ పంజాబ్ నేషనల్ బ్యాంకు రేటింగ్‌ను తగ్గించింది. ఇటీవల బ్యాంకులో చోటుచేసుకున్న 2 బిలియన్ యుఎస్ డాలర్ల అవినీతి, అంతర్గత నియంత్రణ వ్యవస్థ బలహీనతను బయటపెట్టిందని మూడీస్ పేర్కొంది. రేటింగ్‌కు సంబంధించిన బాహ్య దృక్కోణాన్ని మాత్రం స్థిరంగా ఉంచింది. కాగా మూడీస్, బ్యాంకు విదేవీ కరెన్సీ జారీ రేటింగ్‌ను ‘బిఏ1’కు తగ్గించింది. అంతకుముందు ఇది ‘బిఏఏ3’ గా ఉండేది. అంటే బ్యాంకు పెట్టుబడి రేటును తగ్గించినట్టు స్పష్టమైంది. దీనివల్ల బ్యాంక్ బేస్‌లైన్ క్రెడిట్ అసెస్‌మెంట్ (బీసీఏ) ‘బీఎ3’ నుంచి ‘బీ1’కు సర్దుబాటు అవుతుందని మూడీస్ పేర్కొంది. ‘ పెట్టుబడుల విషయంలో ఉన్న పరిమితులను దాటి కొనసాగిన అక్రమ లావాదేవీలను గుర్తించడంలో జరిగిన జాప్యం, బ్యాంకుపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఇది అంతర్గత నియంత్రలోని బలహీనతలను బయటపెట్టింది’ అని మూడీస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
గత ఫిబ్రవరిలో మొదటిసారిగా బ్యాంకు రూ.11,390 కోట్ల విలువైన అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. తర్వాత ఈ మొత్తం రూ.14,400 కోట్లకు చేరింది. కుప్పలు తెప్పలుగా ఉన్న నిరర్థక ఆస్తులు బ్యాంకు ఎర్నింగ్ ప్రొఫైల్ బలహీనం చేశాయి. ఫలితంగా ఈ అక్రమ లావాదేవీల ప్రభావాన్ని బ్యాంకు తట్టుకునే పరిమితి కూడా కుదించుకుపోయింది. ఈ ప్రభావం వచ్చే 12-18 నెలల వరకు ఉంటుందని మూడీస్ పేర్కొంది. ప్రభుత్వం మూలధన పెట్టుబడి సదుపాయం కల్పించడం వల్ల, ఈ అక్రమ లావాదేవీల వల్ల నష్టపోయిన వాటిల్లో చాలావరకు బ్యాంకు పూడ్చుకోగలుగుతుందని కూడా మూడీస్ స్పష్టం చేసింది. పీఎన్‌బీ తనకున్న అప్రధాన అస్తుల అమ్మకం, ప్రభుత్వం నుంచి అందే పెట్టుబడి, పీఎన్‌బీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో పాక్షికంగా తన వాటాలను అమ్మడం ద్వారా కోలుకునే అవకాశమున్నదని పేర్కొంది. బ్యాంకుకు సంబంధించిన నష్టకారక ఆస్తుల్లో ఈ అక్రమ లావాదేవీలు 320 బేసిస్ పాయింట్లు ఉన్నటు మూడీస్ వెల్లడించింది. 50 శాతం అక్రమాలు వెల్లడైన తర్వాత బ్యాంకు కామన్ ఈక్విటీ టైర్ 1 (సీఈటీ-1) నిష్పత్తి 5.95 శాతానికి పడిపోయింది. 2017, డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇది 8.05 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలోని జనవరి-మార్చి త్రైమాసికంలో పీఎన్‌బీ రూ.13,417 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ నష్టం రూ.262 కోట్లు కావడం గమనార్హం.