బిజినెస్

రోబోటిక్స్‌పై నీతిఆయోగ్-ఎబీబీల మధ్య అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు రంగాల ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందేందుకు వీలుగా ఏబీబీ ఇండియా, నితి ఆయోగ్‌లు ఒక అవగాహనకు వచ్చాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థలు ‘స్టేట్‌మెంట్ ఆఫ్ ఇంటెంట్’ (ఎస్‌ఓఐ)పై సంతకాలు చేశాయి. ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడం, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వంటి రంగాల్లో కలిసి కృషి చేస్తామని ఏబీబీ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ఏబీబీ సీఈఓ అల్‌రిచ్ స్పైషోఫర్ మాట్లాడుతూ, ‘మా సంస్థ భారత్‌లోకి ప్రవేశించి వందేళ్లు పూర్తయింది. పారిశ్రామిక డిజటలీకరణలో మేం గొప్ప కృషి చేశాం. ఇదే సమయంలో భారత్ తర్వాతి దశ పరిణామ క్రమంలోకి ప్రవేశించేందుకు అనువుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం’ అన్నారు. ఈ సమన్వయం తర్వాత సీనియన్ ప్రభుత్వ అధికార్లకు బెంగళూరులో ఒక వర్క్‌షాపు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. దేశంలో ఆహార శుద్ధి రంగానికి పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో, డిజిటల్ మరియు ఆటోమేషన్ టెక్నాలజీలను ప్రవేశపెట్టే అంశాలపై వర్క్ షాపులో ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. పరస్పర చర్చల అనంతరం ఎబీబీ, నితీ ఆయోగ్‌లు అభివృద్ధికి సంబంధించి వివిధ ప్రభుత్వ మంత్రిత్వశాఖలకు మార్గదర్శకాలను సూచిస్తాయి.