బిజినెస్

చక్కెర నిల్వకు అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: మూడు మిలియన్ టన్నుల మేర చక్కెరను నిల్వచేయడానికి వీలుగా కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ ఒక ముసాయిదాను రూపొందించింది. ఎక్స్- మిల్లు కనీస ధరను నిర్ణయించడం ద్వారా, ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న చక్కెర మిల్లులను ఆదుకునేందుకు కేంద్రం ఈ చర్యకు ఉపక్రమించింది. ఇప్పటికే దేశంలోని చక్కెర మిల్లులు చెరకు పండించే రైతులకు బకాయిలు చెల్లించలేని దుస్థితికి చేరుకున్నాయి. తాజాగా ఈ బకాయిలు రూ.22,000 కోట్లకు చేరుకోవడం గమనార్హం.
అత్యధిక చెరకు ఉత్పత్తి కారణంగా చక్కెర ధరలు పడిపోయాయి. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఇటీవల, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ, ప్రస్తుతం దేశంలో చక్కెర మార్కెట్‌లో నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. 2017-18 సీజన్‌లో దేశంలో చెరకు ఉత్పత్తి రికార్డు స్థాయిలో 31.6 మిలియన్ టన్నులకు చేరింది. దీంతో చక్కెర మిల్లులు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.22 వేలకోట్లకు పెరిగాయి. ‘పవార్ సూచించిన సలహాల మేరకు, ప్రధాని కార్యాలయం, కమిటీ ఆఫ్ సెక్రటరీస్, ఆహార మంత్రిత్వశాఖలు కలిసి రెండు మూడు పరిష్కార మార్గాలతో కూడిన ఒక డ్రాఫ్ట్ కేబినెట్ నోటును తయారు చేశాయి’ అని అధికార వర్గాలు తెలిపాయి. మూడు మిలియన్ టన్నుల చక్కెరను నిల్వచేసి కనీస ఎక్స్-మిల్లు ధరను కిలోకు రూ.30గా నిర్ణయించి, నెలవారీగా మార్కెట్‌లోకి విడుదల చేయాలని మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. ప్రతి మిల్లుకు కోటాను నిర్ణయించడం ద్వారా స్టాక్ పరిమితులు విధించాలని ఆ ప్రతిపాదనల్లో పేర్కొంది. ప్రస్తుతం చక్కెర ఎక్స్‌మిల్లు ధర కిలోకు సగటున రూ.25.60-26.22 మధ్య కొనసాగుతోంది. ఇది ఉత్పత్తి ఖర్చుకంటే చాలా తక్కువ.
ఎథనాల్ ధరలను పెంచడం, మొలాసిస్‌పై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా విధిస్తున్న పన్నులను రద్దు చేయడం, ఎథనాల్ అమ్మకాలపై విధిస్తున్న జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం వంటి పరిష్కార మార్గాలను పవార్ సూచించారు. ఇదే సమయంలో మిల్లర్లకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కూడా కోరారు. ఈ నెల మొదట్లో కేంద్రం క్వింటాలుకు రూ.5.5 ఉత్పత్తి రాయితీని చెల్లించేందుకు అంగీకరించింది. దీనివల్ల చెరకు రైతులకు బకాయిలు చెల్లించడానికి మిల్లర్లకు కొంతమేర వెసులుబాటు కలుగుతుంది. దీనికి తోడు కేంద్రం చక్కెర దిగుమతి సుంకాన్ని వందశాతం పెంచింది. ఇదే సమయంలో ఎగుమతి పన్నును రద్దు చేసింది. రెండు మిలియన్ టన్నుల చక్కెరను ఎగుమతి చేసుకోవడానికి మిల్లర్లకు అనుమతించింది. కాగా దేశీయంగా చక్కెర డిమాండ్ 25 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు.