బిజినెస్

యుద్ధ విమానాల ఎగుమతి హబ్‌గా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 23: ఎఫ్-16 యుద్ధ విమానాల తయారీని చేపట్టడం వల్ల, భారత్ ఈ విమానల ఎగుమతుల హబ్‌గా రూపొందుతుందని లాక్‌హీడ్ మార్టిన్ పేర్కొంది. రానున్న కొద్ది దశాబ్దాల కాలంలో భారత్ 165 బిలియన్ డాలర్ల మేర యుద్ధ విమానాల మార్కెట్‌లో చోటు సంపాదిస్తుందని పేర్కొంది. లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ వైస్-ప్రెసిడెంట్ వివేక్ లాల్ మాట్లాడుతూ ఎఫ్-16 బ్లాక్ 70 అత్యాధునిక యుద్ధవిమానమన్నారు. ఇందులో ఉపయోగించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన ఎఫ్-16 విమానాల్లో ఉపయోగించలేదన్నారు. ఉత్పత్తి ప్రారంభించిన ఐదేళ్ల తర్వాత వీటి ఎగుమతులు ప్రారంభమవుతాయన్నారు.
భారత్ చేసుకునే ఎంపికను బట్టి, రెండు వందల వరకు ఎఫ్-16 విమానాలను భారత్ నుంచి ఎగుమతి చేయవచ్చునని లాల్ తెలిపారు. యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అర్రే రాడార్, ఆధునిక కాక్‌పిట్, ఆధునిక ఆయుధాలు, ఎక్కువ దూరాలను ప్రయాణించడానికి వీలుగా ఇంధన ట్యాంకులు, ఆటోమేటిక్ గ్రౌండ్ కొల్లిజన్ ఏవియోడెన్స్ సిస్టమ్, ఆధునిక ఇంజిన్‌ను ఎఫ్-16 బ్లాక్ 70లో అమర్చామన్నారు. ఎఫ్-35తో పోలిస్తే, బ్లాక్ 70 మిషన్ సిస్టమ్స్‌లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా ఆధునికమైందన్నారు. 5వ తరం ఫైటర్‌లో ఉపయోగించే రాడార్ ఇందులో ఉపయోగిస్తున్నామన్నారు.
రానున్న 30 ఏళ్ల కాలంలో 165 బిలియన్ యుఎస్ డాలర్ల విలువైన ఏఫ్-16 విమానాలకు డిమాండ్ ఉంటుందన్నారు. 2050 నాటికి ప్రపంచంలో కొన్ని వందల ఎఫ్ -16 యుద్ధ విమానాలు రంగంలో ఉంటాయని అంచనా వేస్తునట్టు తెలిపారు. ఇక మేకిన్ ఇండియా కార్యక్రమం కింద ఎప్-16కు సంబంధించి గరిష్ఠ స్థాయిలో హర్డ్‌వేర్ స్పేర్లు ఇండియాలోనే ఉత్పత్తి అవుతాయన్నారు. ఇప్పటికే లాక్‌హీడ్ మార్టిన్ భారత్‌లోని వంద మంది సరఫరాదారులతో సంప్రదింపులు జరిపిందన్నారు.
లాక్‌హీడ్ ఎఫ్-16 పరిశ్రమలో జీఈ, టెర్మా, హానీవెల్, ఫోక్కర్, ఇజ్రాయిల్‌కు చెందిన ఏరోస్పేస్ పరిశ్రమలు, ఎల్‌బిట్, యుటిసి, ఈటాన్, మూగ్, పార్కర్ వంటి సంస్థలు సరఫరాదార్లుగా కొనసాగుతున్నాయి. లాక్‌హీడ్ ఉత్పత్తులకు సంబంధించిన వందలాది సాంకేతిక పరిజ్ఞానాలను భారత్‌కు బదలాయిస్తామన్నారు.