బిజినెస్

దేశీయ మార్కెట్ల ఢమాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 23: ఇంధన, లోహ రంగాల షేర్ల నేతృత్వంలో విస్తృతంగా సాగిన అమ్మకాల ఒత్తిడి వల్ల బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు బాగా బలహీనపడ్డాయి. మార్కెట్ కీలక సూచీలు పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 306 పాయింట్లు పడిపోయి, నెల రోజుల కనిష్ట స్థాయి 34,344.91 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కీలకమయిన 10,500 పాయింట్ల స్థాయికన్నా దిగువకు దిగజారింది. పెట్రోల్, డీజిల్ అధిక ధరల భారాన్ని మోయాల్సిందిగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తుందేమోనన్న భయాందోళనలు నెలకొనడంతో మదుపరులు తమ వద్ద ఉన్న ఈ కంపెనీల షేర్లను వదిలించుకోవడానికి పూనుకున్నారు. దీంతో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ, ఓఎన్‌జీసీ, ఓఐఎల్ కంపెనీల షేర్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. సెనె్సక్స్ బుధవారం 34,656.63 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, మరింత ముందుకు సాగుతూ తొలి దశ లావాదేవీలలో 34,668.47 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే ఆ తరువాత ప్రతికూల ధోరణిలోకి వెళ్లిపోయిన ఈ సూచీ 34,302.89 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 306.33 పాయింట్ల (0.88 శాతం) దిగువన 34,344.91 పాయింట్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ 19న 34,427.29 పాయింట్ల వద్ద ముగిసిన ఈ సూచీ ఆ తరువాత ఇంత దిగువ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి.
సెనె్సక్స్ బాటలోనే నిఫ్టీ కూడా బుధవారం కీలకమయిన 10,500 పాయింట్ల స్థాయికన్నా దిగువకు పతనమయి, 10,430.35 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ సూచీ 106.35 పాయింట్ల (1.01 శాతం) దిగువన స్థిరపడింది. ఇంట్రా-డేలో ఈ సూచీ 10,417.80- 10,533.55 పాయింట్ల మధ్య కదలాడింది. ఇదిలా ఉండగా, మంగళవారంనాటి లావాదేవీలలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 1,651.63 కోట్ల విలువయిన షేర్లన విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 1,496.83 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.
ఆరు శాతం పడిపోయిన వేదాంత షేర్ విలువ
తమిళనాడులోని టుటికోరిన్‌లో ఉన్న వేదాంత గ్రూప్‌కు చెందిన స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌ను మూసివేయాలనే డిమాండ్‌తో మంగళవారం ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు కాల్పులు జరుపడంతో తొమ్మిది మంది మృతి చెందిన నేపథ్యంలో బుధవారం వేదాంత గ్రూప్ షేర్ ధర ఆరు శాతం పడిపోయింది. బీఎస్‌ఈలో బుధవారం బలహీనంగా ప్రారంభమయిన ఈ షేర్ ధర తరువాత 5.80 శాతం పడిపోయి, రూ. 253.85 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో వేదాంత షేర్ విలువ ఆరు శాతం పడిపోయి, రూ. 253.75 వద్ద ముగిసింది.