బిజినెస్

నాలుగింతలైన గెయిల్ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24 : మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో గెయిల్ ఇండియా నాలుగు రెట్ల లాభాన్ని నమోదు చేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.1,021 కోట్ల నికర లాభం పొందింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పొందిన లాభం రూ.260 కోట్లతో పోలిస్తే ఇది 293 శాతం అధికమని గెయిల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బీసీ త్రిపాఠి వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్ 13 శాతం పెరిగి రూ.15,396 కోట్లకు చేరుకుంది. రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో గెయిల్ మొత్తం రూ.24వేలకోట్ల మేర పెట్టుబడి వ్యయం చేపట్టనుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది రూ.6,400 కోట్లు ఖర్చు చేయనుంది. ముఖ్యంగా గ్యాస్‌పైప్‌లైన్‌ల నిర్మాణంపైనే ఈ పెట్టుబడులు పెట్టనుంది. 2017-18 ఆర్థిక సంవత్సంలో కంపెనీ మొత్తం రూ.4,618 కోట్ల మేర నికర లాభం ఆర్జించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం పొందిన రూ.3,503 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 32 శాతం అధికం
కంపెనీని మార్కెటింగ్ మరియు రవాణా విభాగాలుగా విభజించే అవకాశాలు ఉన్నట్టు గెయిల్ ఇండియా గురువారం వెల్లడించింది. గ్యాస్ మార్కెట్ పూర్తి స్థాయికి చేరుకున్న తర్వాతనే ప్రపంచ వ్యాప్తంగా కంపెనీని విడగొట్టాయన్న సంగతిని కంపెనీ గుర్తు చేసింది.