బిజినెస్

నీరవ్ మోదీ సహచరులపై ఈడీ అభియోగ పత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోడీ, అతని అసోసియేట్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభియోగపత్రం దాఖలు చేసింది. దేశ వ్యాప్తంగా పిఎన్‌బి స్కాంగా ఈ కేసు చరిత్రలో నిలిచిపోనుంది. ఈ స్కాంలో రెండు బిలియన్ డాలర్లను బ్యాంకుకు నీరవ్ మోదీ ఎగగొట్టాడని ఇడి అధికారులు అభియోగం మోపారు.
దేశంలో అతి పెద్ద ఫ్రాడ్ కేసు ఇదేనని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముంబాయి బ్రాంచిలో ఈ కేసు వెలుగుచూసింది. మొత్తం 12వేల పేజీల చార్జిషీటును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ ప్రివెన్షన్ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద నీరవ్ మోదీపై కేసులు నమోదు చేశారు. త్వరలో నీరవ్ మోడీ బంధువుపై రెండవ చార్జిషీటును ఎన్‌ఫోర్స్‌మెంట్ దాఖలు చేయనుంది. ఈ బంధువుపేరు మెహుల్ చోక్సీ. అతను ఆభరణాల వ్యాపారం చేస్తున్నాడు. అతను కూడా స్కాం బయటపడకుండా ముందే దేశం విడిచిపెట్టివెళ్లాడు. నీరవ్ మోదీకి చెందిన రూ. 170 కోట్ల ఆస్తులను ఇప్పటికే జప్తు చేశారు. నీరవ్ మోడీ బంధువుకు చెందిన గీతాంజలి షాపులో నుంచి 34వేల ఆభరణాల ముక్కలను సీజ్‌చేశారు. దీని విలువ రూ. 85 కోట్లు. ఈ కేసులో మొత్తం నిందితులకు సంబంధించి ఇంతవరకు రూ.7600 కోట్ల ఆస్తులను అధికారులు జప్తు చేశారు. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సిబిఐ)తో పాటు ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో సిబిఐ ఇప్పటికే రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది.