బిజినెస్

12.64 శాతం పెరిగిన బ్యాంకు రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 24: ఆర్‌బీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం 2018, మే 11తో ముగిసిన పదిహేను రోజుల కాలానికి బ్యాంకుల రుణాలు 12.64 శాతం పెరిగి రూ.85,51,099 కోట్లకు చేరుకున్నాయి. 2017,మే 12తో ముగిసిన పదిహేను రోజుల కాలంలో బ్యాంకుల రుణాలు రూ.75,90,941 వద్ద స్థిరంగా ఉన్నాయి. అదే 2018, ఏప్రిల్ 27తో ముగిసిన పదిహేను రోజుల కాలంలో బ్యాంకు రుణాలు 12.61 శాతం పెరిగి, 85,38,570గా నమోదు కాగా, 2017, ఏప్రిల్ 28తో ముగిసిన 15 రోజుల కాలంలో బ్యాంకుల రుణాలు 75,82,391 కోట్లు. బ్యాంకు డిపాజిట్ల విషయానికి వస్తే, మే 11తో ముగిసిన పదిహేను రోజుల్లో 7.61 శాతం పెరిగి 1,13,92,165 కోట్లకు చేరుకున్నాయి, 2017 ఇదే కాలంలో డిపాజిట్ల మొత్తం రూ.1,05,86,083 కోట్లు. 2018, ఏప్రిల్ 27తో ముగిసిన పదిహేను రోజుల కాలంలో డిపాజిట్లు 8.20 శాతం పెరిగి రూ.1,14,30,786కు చేరుకున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఆహారేతర బ్యాంకు రుణం 8.4 శాతం పెరిగింది. 2017 మార్చిలో కూడా ఇదే రేటు కొనసాగింది. వ్యవసాయం, అనుబంధ రంగాలకు మంజూరు చేసే రుణాలు 2018, మార్చిలో 3.8 శాం పెరిగాయి. అదే 2017, మార్చిలో వీటి పెరుగుదల 12.4 శాతం. 2018, మార్చిలో పరిశ్రమలకు ఇచ్చిన రుణాలు 0.7 శాతం పెరగ్గా, 2017, మార్చిలో ఇవి 1.9 శాతం తగ్గిపోయాయి.