బిజినెస్

విదేశీ మదుపరుల కోసం ఐఎఫ్‌ఎస్‌సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: విదేశీపెట్టుబడిదారులకు శుభవార్త. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసస్ సెంటర్ (ఐఎఫ్‌ఎస్‌సి) ద్వారా స్టాక్‌మార్కెట్ లావాదేవీలను విదేశీపెట్టుబడిదారులకు నిర్వహించేందుకు అనుమతిస్తూ సెబి నిర్ణయం తీసుకుంది. దీనిపై సెబి ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ఇనె్వస్టర్లకు సెగ్రిగేటెడ్ నామినీ అకౌంట్ ద్వారా ఐఎఫ్‌ఎస్‌సిలో ప్రవేశం కల్పించారు. వీరికి విశిష్ట క్లైంట్ కోడ్‌ను కేటాయిస్తారు. కాగా విదేశీ ఇనె్వస్టర్లు ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలుచేస్తారు. వీరు కెవైసి వివరాలను, ఎండ్ క్లైంట్ వివరాలను పొందపరచాల్సి ఉంటుంది. మనీ లాండరింగ్ లావాదేవీలకు పాల్పడకుండా నిబంధనలను కూడా విధించారు. గుజరాత్ ప్రభుత్వం గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని ఏర్పాటు చేసింది. దేశంలో తొలి ఐఎఫ్‌ఎస్‌సిగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా స్టాక్ మార్కెట్ లావాదేవీలను నిర్వహించేందుకు వీలుగా అనుసంధానం సదుపాయం ఉంది.
వీరికి అత్యంత ఆధునిక సాంకేతిక సదుపాయాన్ని కూడా కల్పించారు. దేశంలో ఐఎఫ్‌ఎస్‌సి ఏర్పాటుకు అవసరమైన మార్గదర్శకాలను సెబి 2015 మార్చిలో జారీ చేసింది. దీనివల్ల దేశంలో ఫైనాన్షియల్ హబ్స్ ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించారు.