బిజినెస్

పెట్రోలుపై సుంకాన్ని రాష్ట్రాలే తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: రాష్ట్రాలు పెట్రోల్‌పై విధించే పన్నును తగ్గించాలని, ఇదే సమయంలో కేంద్రం పెరుగుతున్న చమురు ధరల ప్రభావం లేకుండా కొంత మేర ఆర్థిక వెసులుబాటును కల్పించాలని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ కోరారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, దేశంలోని చమురు కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను వరుసగా 11వ రోజు కూడా పెంచేశాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.77.47 కాగా, డీజిల్ ధర లీటరుకు 68.53 పలుకుతోంది.‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్,డీజిల్‌పై పన్నులను తగ్గించవచ్చు. అయితే ఎక్కువగా తగ్గించాల్సింది రాష్ట్రాలే. చమురుపై విలువను బట్టి పన్ను విధించడం సముచితంగా ఉంటుంది..అందువల్ల రాష్ట్రాలే ఎక్కువగా పన్నును తగ్గించాలి,’ అని కుమార్ స్పష్టం చేశారు. 10-15 శాతం పన్ను కోత విధించి, అదే మొత్తాన్ని బడ్జెట్‌లోనుంచి తీసుకోవచ్చు. ఒకవేళ ఈ విధంగా చేయకపోతే అది దురాశ కిందికే వస్తుంది, అన్నారు. పెట్రోలుపై రాష్ట్రాలు విధించే పన్ను సగటను 27 శాతం వరకు ఉంటోందని ఆయన చెప్పారు.
ఇక కేంద్ర ప్రభుత్వం మరింత ఆర్థిక వెసులు బాటు కల్పించి, పెరుగుతున్న ధరల సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉన్నదన్నారు. ముఖ్యంగా కేంద్రం పెట్రోల్‌పై విధించే అదనపు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించవచ్చు. కేవలం పెట్రోలు మాత్రమే కాదు, విద్యుత్‌ను కూడా వస్తుసేవల పన్ను పరిధిలోకి తీసుకొని రావాలన్నారు. కర్నాటక ఎన్నికల ముందు 19 రోజుల పాటు పెట్రోలు ధరలు పెంచలేదు. అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని క్రమంగా చమురు కంపెనీలు వినియోగదారుడిపై మోపుతున్నాయి. 2014, నవంబర్ నుంచి 2016 జనవరి వరకు పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తొమ్మిదిసార్లు పెంచింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది.