బిజినెస్

బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ), బ్యాంకింగ్, లోహ, ఫార్మా షేర్లకు మదుపరుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ తిరిగి 318 పాయింట్లు పుంజుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ తిరిగి కీలకమయిన 10,500 స్థాయికి పైన ముగిసింది. దేశీయ సంస్థాగత మదుపరుల (డీఐఐల) నిరంతరాయ కొనుగోళ్లు కీలక సూచీలు బాగా పుంజుకోవడానికి దోహదపడ్డాయి. సెనె్సక్స్ గురువారం ఉదయం నుంచి సెషన్ అంతా సానుకూల ధోరణిలోనే సాగింది. ఇంట్రా-డేలో ఒక దశలో 34,741.46 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 318.20 పాయింట్ల (0.93 శాతం) పైన, 34,663.11 పాయింట్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ అయిదో తేదీన 577.73 పాయింట్లు పుంజుకున్న ఈ సూచీ, ఆ తరువాత ఒకే సెషన్‌లో ఇంత భారీగా పుంజుకోవడం ఇదే మొదటిసారి. ఈ సూచీ బుధవారంనాటి లావాదేవీలలో 306.33 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ గురువారం ఇంట్రా-డేలో 10,535.15 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 83.50 పాయింట్ల (0.80 శాతం) ఎగువన 10,513.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. టెక్నాలజి షేర్ల ధరలు బాగా పెరిగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలిక సానుకూలంగా ఉండటంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ల ధరలు పుంజుకున్నాయి. దీంతో ఐటీ ఇండెక్స్ 2.45 శాతం పెరిగింది. ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్సియల్, లోహ రంగాల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతు దేశీయ మార్కెట్లు బలపడటానికి దోహదపడింది. ఇదిలా ఉండగా, బుధవారంనాటి లావాదేవీలలో దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నికరంగా రూ. 789.78 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 311.11 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.