బిజినెస్

రెండో రోజూ లాభాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 25: దేశీయ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లోనే ముగిసాయి. రూపాయి కోలుకోవడం, దేశీయ సంస్థాగత మదుపర్లు నిరంతరం కొనుగోళ్లు జరపడం మార్కెట్ల జోరుకు కారణమని బ్రోకర్లు తెలిపారు. ఫలితంగా సెనె్సక్స్ 261 పాయింట్లు లాభపడి 34,924.87 వద్ద ముగియగా, నిఫ్టీ 91.30 పాయింట్ల లాభంతో 10,605.15 వద్ద ముగిసింది. డోనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో జరగాల్సిన చర్చలను రద్దు చేయడం, ఆటో దిగుమతులపై సుంకాలు విధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. శుక్రవారం సెనె్సక్స్ లాభాల్లో 34,753.47 వద్ద ప్రారంభమై, ఒక దశలో 35,017.93కు చేరుకొని చివరకు 34,753.47 వద్ద 261.76 పాయింట్ల లాభంతో ముగిసింది. ఇక నిఫ్టీ కూడా10,628.05, 10,524 మధ్య ఊగిసలాడి చివరకు 91.30 పాయింట్ల లాభంతో 10.605.15 వద్ద ముగిసింది. వారం మొత్తంమీద చూస్తే సెనె్సక్స్ 76.57 పాయింట్ల ఒక మాదిరి లాభాన్ని ఆర్జించగా, నిఫ్టీ 8.75 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. కాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాలు భారతీయ మార్కెట్లు మంచి లాభాల్లోనే కొనసాగాయి. 2014, మే 26న మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గరినుంచి సెనె్సక్స్ 10,207.99 పాయింట్ల మేర ఎగసింది. ఇదే సమయంలో నిఫ్టీ 3,246.10 పాయింట్ల మేర వృద్ధి నమోదు చేసింది. 2018, జనవరి 29న సెనె్సక్స్ ఎన్నడూ లేని రీతిలో 36,443.98కి గరిష్టానికి చేరుకుంది. ఇదిలావుండగా ప్రాథమిక సమాచారం ప్రకారం గరువారం స్థానిక సంస్థాగత మదుపర్లు రూ.1,480.51 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయగా, విదేశీ పోర్టుపోలియో మదుపర్లు రూ.701.93 కోట్ల విలువైన షేర్ల అమ్మకాలు జరిపారు. ప్రభుత్వం రంగ చమురు సంస్థలైన ఐఓసీ, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌లు నిన్నటి నష్టాలనుంచి కొద్దిగా కోలుకున్నాయి. ఓఎన్‌జీసీ అత్యధిక లాభాలను నమోదు చేయగా, ఇన్ఫోసిస్, టాటా ఎలెక్సీ, విప్రోలు లాభాల బాటలో నడిచాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ విలువ రూ.7లక్షల కోట్లకు చేరుకుంది. ఈ స్థాయికి మార్కెట్ విలువ పెరిగిన తొలి భారతీయ కంపెనీగా టీసీఎస్ రికార్డు సృష్టించింది. ఎస్ బ్యాంకు, ఇండస్‌లాండ్ బ్యాంకు, ఆదానీ పోర్టులు, యాక్సిస్ బ్యాంకు, హీరో మోటోకార్పొరేషన్, టాటా మోటార్స్, కోటక్ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, మారుతి సుజికీ, ఎం అండ్ ఎం, హెడీఎఫ్‌సీ బ్యాంకు, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, హెచ్‌యుఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఆర్‌ఐఎల్‌ల షేర్లు లాభాల్లో కొనసాగాయి. కోల్ ఇండియా, ఐడీసీ, ఎస్‌బీఐ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఆసియన్ పెయింట్స్ నష్టాలను చవిచూశాయి.