బిజినెస్

దిగుమతి సుంకం పెంపు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: ఉక్కు, అల్యూమినియంపై దిగుమతి సుంకాల పెంపు, వీసాలపై ఆంక్షలు అంశాలపై ఐదు రోజుల అమెరికా పర్యటనలో ఆ దేశ ఉన్నతాధికారులతో వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు చర్చించనున్నారు. సురేష్ ప్రభు ఐదు రోజుల అమెరికా పర్యటన జూన్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆయన అమెరికాలో అమెరికా వాణిజ్య ప్రతినిధి, అమెరికన్ వాణిజ్య సెక్రటరీ (యుఎస్‌టిఆర్)తో విస్తృత స్థాయి చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మాట్లాడుతూ అమెరికా-్భరత్‌ల మధ్య దృఢమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ పర్యటనలో అమెరికాను ప్రభావితం చేసే పెద్దవాణిజ్య సంస్థల అధినేతలను కలవనున్నారు. అమెరికాలో ఐటి కంపెనీల్లో అనేక మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. హెచ్-1 బి వీసా జారీని కఠిన తరం చేస్తారన్న వార్తల నేపథ్యంలో సురేష్ ప్రభు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ నుంచి అమెరికాకు సాలీనా 1.5 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా భారత్ ఉత్పత్తుల దిగుమతిపై సుంకాన్ని పెంచడంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయమై ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత్ ఫిర్యాదు చేసింది. తమ దేశీయ కంపెనీల అభివృద్ధికి అవరోధంగా ఉందని దిగుమతి సుంకాన్ని పెంచినట్లు అమెరికా పేర్కొంది. భారత్ నుంచి అమెరికాకు 2016-17లో 42.21 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. కాగా అమెరికా నుంచి భారత్ 22.3 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది.
పారిస్‌లో ప్రపంచ వాణిజ్య సంస్థ దేశాల సమావేశం
వచ్చే నెలలో ప్రపంచ వాణిజ్య సంస్థ దేశాల సమావేశం పారిస్‌లో జరుగుతుందని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. గతనలభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ వాణిజ్యం సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. ఈ సమావేశంలో వివాదాల పరిష్కార సంస్థ ఏర్పాటు చేసే విషయం కూడా ప్రస్తావనకు వస్తుందన్నారు.