బిజినెస్

ఐసీఐసీఐ ఎండీ చందా కొచ్చర్‌కు సెబీ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 25: ఐసిఐసిఐ బ్యాంకు సిఇవో, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్‌కు సెబి సంస్థ నోటీసులు జారీ చేసింది. వీడియోకాన్, నూపవర్ సంస్థలో ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే విధంగా ఈ సంస్ధలతో ఐసిఐసిఐ ఆర్థిక వ్యవహరాలు నడిపారనే అభియోగాలు వచ్చిన విషయం విదితమే. త్వరలో సెబి ఇచ్చిన నోటీసును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత నివేదికను సెబికి సమర్పిస్తామని ఐసిఐసిఐ పేర్కొంది. 2012లో ఐసిఐసిఐ బ్యాంకు వీడియోకాన్‌కు రూ. 3250 కోట్ల రుణాలను ఇచ్చింది. ఇందులో కొశ్చర్ భర్తకు పాత్ర ఉందనే అభియోగంపై ఇప్పటికే సిబిఐ ప్రాథమిక దర్యాప్తును చేపట్టింది. నూ పవర్ రెన్యువబుల్స్‌లో వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ రూ. 64 కోట్ల పెట్టుబడులను పెట్టారు. ఈ సంస్థ యజమానిగా దీపక్ కొచ్చర్ ఉన్నా రు. ఐసిఐసిఐ తదితర బ్యాంకుల నుంచి వీడియోకాన్ రుణాలను పొందింది. ఈ విధంగా రుణాలు ఇవ్వడంలో ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఐసిఐసిఐ పేర్కొంది. ఈ వ్యవహారంపై సెబి నుంచి ఈ నెల 24వ తేదీన నోటీసు అందినట్లు ఐసిఐసిఐ పేర్కొంది. లిస్టింగ్ ఒప్పందాలు, సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణాల మంజూరు ఉందని సెబి నోటీసులో పేర్కొంది. కాగా ఐసిఐసిఐ సిఇవో, ఎండి చందా కొచ్చర్ పట్ల బ్యాంకుకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ఈ డీల్‌లో ఎటువంటి క్విడ్ ప్రో కో లావాదేవీలు జరగలేదని బ్యాంకు చైర్మన్ ఎంకెశర్మ తెలిపారు.