బిజినెస్

ప్రభుత్వ థర్మల్ ప్లాంట్లకే బొగ్గు సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో పనిచేస్తున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లు అల్లాడుతున్నాయి. దీని వల్ల విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపనుంది. తక్షణమే బొగ్గును సేకరించి థర్మల్ ప్లాంట్లకు కొరత రాకుండా చూసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కోల్ ఇండియా లిమిటెడ్‌ను ఆదేశించింది. ప్రభుత్వ రంగ సంస్థల విద్యుత్ ప్లాంట్లకు మాత్రమే బొగ్గును సరఫరా చేయాలని కేంద్రం మహానది కోల్ ఫీల్డ్స్ సంస్థను ఆదేశించింద. వేసవి తాపంతో దేశ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలోని విద్యుత్ ప్లాంట్లకు బొగ్గును సరఫరా చేయాలని ఆదేశించారు.
డిమాండ్‌కు తగ్గట్టుగా బొగ్గును ఉత్పత్తి చేసేందుకు కోల్ ఇండియా సంస్థ సమాయత్తమవుతోంది. ప్రైవేట్ విద్యుత్ థర్మల్ ప్లాంట్లకు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యుత్ ప్లాంట్లకు సరఫరా చేయాలన్న ఆదేశాలు సరికాదని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బొగ్గు కొరత వల్ల ప్రైవేట్ విద్యుత్ సంస్థల పిఎల్‌ఎఫ్ 55 శాతం వద్దనే నిలచిపోయింది.