బిజినెస్

సొంత గనులు కలేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 26: ప్రతిష్ఠాత్మక విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించే అంశంపై ఇక ఆశలు వదులుకున్నట్టేనా! ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకుండా అన్యాయం చేస్తోందని భావించగా, అసలు గనుల కేటాయింపు అంశం రాష్ట్రాల పరిధిలోనిదే నంటూ తేల్చేశారు. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న స్టీల్‌ప్లాంట్ ఇప్పుడు నష్టాల బాటలో కొట్టుమిట్టాడేందుకు గల కారణాల్లో సొంత గనులు లేకపోవడం కూడా ఒకటి. దేశంలో బిలాయ్, బొకారో, దుర్గాపూర్, సేలం, రూర్కెలా ప్రాంతాల్లోని ప్రభుత్వ రంగ ఉక్కు కర్మాగారాలకు, టాటా, బళ్లారి వంటి ప్రైవేటు ఉక్కు కర్మాగారాలకు సొంత గనులు ఉన్నాయి. తాజాగా ఒడిశాలో దక్షిణ కొరియా ఏర్పాటు చేసిన పోస్కో ఉక్కు కర్మాగారానికి సైతం ఒడిశా రాష్ట్రంలో సొంత గనులున్నాయి. ఎటువంటి ఉక్కు కర్మాగారాన్ని స్థాపించకుండానే గాలి జనార్దన రెడ్డికి గనులు కేటాయించగా, వైఎస్ జగన్‌కు చెందిన భారతి ఉక్కు పరిశ్రమకు సైతం గనులు కేటాయింపులు జరిగాయి. ఒక్క విశాఖ ఉక్కు మినహా మిగిలిన అన్ని ఉక్కు కర్మాగారాలు సొంత గనులతో ఉత్పత్తి వ్యయం తగ్గించుకుని లాభాల బాటలో నడుస్తుండగా, మార్కెట్‌లో అస్థిరంగా ఉండే ధరలకు ముడి ఇనుము కొనుగోలు చేసుకుంటూ విశాఖ ఉక్కు తల్లడిల్లుతోంది. తొలుత 3.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన విశాఖ ఉక్కు కర్మాగారం, సొంత గనులు లేకున్నా, ఒడిదుడుకులను తట్టుకుని లాభాలార్జించే స్థాయికి చేరింది. ఇటీవలే రూ.12,500 కోట్లు వెచ్చించి ప్లాంట్ సామర్థ్యాన్ని 6.3 మిలియన్ టన్నులకు విస్తరించారు. ఒక టన్ను ఉక్కు తయారీకి ఒకటిన్నర టన్ను ముడి ఖనిజం అవసరం కాగా, ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం టన్ను రూ.3000 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఇదే సొంత గనులున్న కర్మాగారాలకు టన్ను ముడి ఇనుము కేవలం రూ.500లకే లభ్యమవుతుంది. ఈ లెక్కన విశాఖ ఉక్కు ఉత్పత్తి వ్యయం మిగిలిన ప్లాంట్ల కంటే 100 శాతం ఎక్కువ. ఈ నేపథ్యంలో ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) నుంచి విశాఖ ఉక్కు ముడి ఇనుము కొనుగోలు చేస్తోంది. ప్లాంట్ ఏర్పాటు అనంతర కాలంలో ఎన్‌ఎండీసీ నుంచి ఒక బ్లాక్ గనులను విశాఖ ఉక్కుకు కేటాయించేందుకు ఒప్పందం కూడా కుదిరింది.
అయితే కొన్ని కారణాల నేపథ్యంలో ఈ నిర్ణయం అమలుకు నోచుకోలేదు. తాజాగా కేంద్రం 2016లో కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. దీనిపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్శింగరావు ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే సొంత గనులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేటు ఉక్కు కర్మాగారాలకు సొంత గనులు కేటాయించగా విశాఖ ఉక్కుకు మాత్రం అన్యాయం చేశారన్నారు.