బిజినెస్

వేగంగా ప్రైవేటీకరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మరో 11 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలనే ప్రతిపాదనను కేంద్రం చురుకుగా పరిశీలిస్తోంది. ఈ సంస్థల్లో ఢిల్లీలోని అశోక్ హోటల్, ఎంటిఎన్‌ఎల్ టవర్ బిజినెస్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (బిహెచ్‌ఇఎల్) తదితరమైనవి ఉన్నా యి. దీర్ఘకాలిక లీజ్, వ్యూహాత్మక ఒప్పందాల ద్వారా వీటిని విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. నీతి అయోగ్ ఇటీవల ఏ ఏ కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలనే విషయమై ఒక జాబితాను తయారు చేసింది. ఈ జాబితాను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపింది. ఈ జాబితాలో 50 వరకు కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలను అధ్యయనం చేస్తున్నామని ఆర్థిక మంత్రి త్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉప సంఘం ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాలను విక్రయించేందుకు ఇప్పటికే కేంద్రం ప్రతిపాదనలను సిద్ధం చేసిన విషయం విదితమే. ఢిల్లీ నగరబొడ్డున ఉన్న అశోక్ హోటల్ 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. దాదాపు 60 ఏళ్ల పాటు ఈ హోటల్ సంస్థను లీజుకు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. వాజపేయి ప్రభు త్వం ఈ హోటల్‌ను విక్రయించాలని నిర్ణయించగా, అప్పట్లో పర్యాటక మంత్రి త్వ శాఖ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. గతనాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం కూడా పర్యాటక సంస్థ ఆధీనంలో ఉన్న ఈ హోటల్‌ను విక్రయించే విషయమై ఆచితూచి అడుగువేసింది. గత కొనే్నళ్లలో బిహెచ్‌ఇఎల్ మార్కెట్ విలువ గణనీయంగా క్షీణించింది. ప్రైవేట్ రంగం లో ఎల్ అండ్ టి మాత్రం వృద్ధిరేటును బాగా పెంచుకుంది. బిహెచ్‌ఇఎల్ మార్కెట్ విలువ రూ. 27,535 కోట్లు ఉండగా, ఎల్ అండ్ టి విలువ రూ. 1.2 లక్షల కోట్లను దాటింది. కాగా బిహెచ్‌ఇఎల్‌లో ప్రభుత్వం తన వాటాను 63 శాతం నుంచి 49 శాతానికి కుదించుకోవాలని కొంత మంది నిపుణులు కోరుతున్నారు. ఎంటిఎన్‌ఎల్ ఆస్తుల విక్రయాన్ని ప్రారంభించాలని ప్యానె ల్ ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడు బిఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్ తర్వాత నష్టాలు ఎదుర్కొంటున్న మూడవ అతి పెద్ద సంస్థగా ఎంటిఎన్‌ఎల్ ఉంది.
బిఎస్‌ఎన్‌ఎల్‌పై నీతి అయోగ్ ఇంతవరకు ఎటువంటి నివేదిక ఇవ్వలేదు. ఈ సంస్థ 2016- 17లో దాదా పు రూ. 4800 కోట్ల నష్టాలను చవి చూసింది. నేషనల్ టెక్స్‌టైల్ సంస్థ, హిందూస్థాన్ కాపర్, టెలికమ్యూనికేషన్స్ కనె్సల్టెంట్స్ సంస్థలను వ్యూహాత్మక ఒప్పందంలో విక్రయించాలని కేంద్రానికి సిఫార్సులు అందాయి.