బిజినెస్

కోటి కొలువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: రాబోయే రెండు, మూడేళ్ళలో దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్, గార్మెంట్స్, ఫ్యాషన్ టెక్నాలజీలో కోటి మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇందుకు ప్రణాళిక సిద్ధం అవుతున్నదని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. అయితే ఈ ఉద్యోగావకాశాల్లో తప్పనిసరిగా 75 శాతం మంది మహిళలు ఉండాలని ఆయన అన్నారు. టెక్స్‌టైల్ రంగంలో బంగ్లాదేశ్, వియత్నాంలు పేరెన్నికగన్నాయని, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆ రెండు దేశాలతో సమానంగా మన దేశం పోటీ పడుతుందని ఆయన వివరించారు. ఈ రెండు దేశాలతో సమానంగా టెక్స్‌టైల్, అప్పారెల్ పార్కుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరిస్తుందని స్పష్టం చేశారు. వరంగల్‌లో, మిగతా చోట్ల ఎక్కడైనా పార్కుల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే తాను సంబంధిత మంత్రితో మాట్లాడి వేగవంతం చేస్తానని హామీ ఇచ్చారు. ఫ్యాషన్ టెక్నాలజీలో, వివిధ రంగాలకు చెందిన చిన్న పరిశ్రమలు పెంపొందించుకునేందుకు మహిళలకు ప్రోత్సహించనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ పరిసరాల్లో టెక్స్‌టైల్, అప్పారెల్ పార్కులు ఏర్పాటు చేస్తే పోచంపల్లి, నారాయణపేట, గద్వాల చేనేత కార్మికులకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ యువకులను ప్రోత్సహించేందుకు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను అందిస్తామని, తద్వారా 18 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి, మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు ప్రణాళిక రూపొందించాలని కోరుతున్నానని చెప్పారు. ఇందుకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రితో సమావేశమై తెలంగాణకు అత్యధిక లాభాన్ని చేకూరుస్తానని తెలిపారు. కాగా, కొత్తగా పరిశ్రమలు స్థాపించినవారు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే వారికి మూడేళ్ళ పాటు 12 శాతం ఇపిఎఫ్‌ను కేంద్రమే చెల్లిస్తుందని వివరించారు. ఇంతకుముందు ఇపిఎఫ్ 20 మంది ఉద్యోగస్తులకు పైగా ఉంటేనే అర్హత ఉండేదని, కానీ ఇకమీదట 10 మంది ఉన్నా ఇపిఎఫ్ చెల్లించేలా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో చట్ట సవరణ చేయనున్నట్లు కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. కార్మికుల్లో నైపుణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్లు ఆయన చెప్పారు.
ఐటిఐల సీట్ల పెంపు
ఐటిఐలను ఆధునీకరించనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. దేశవ్యాప్తంగా 2 లక్షల 20 వేల సీట్లను పెంచనున్నట్లు ఆయన చెప్పారు. యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు కార్మికుల ఇపిఎఫ్‌కు వడ్డీ చెల్లించకపోవడంతో 42 వేల కోట్ల రూపాయలు నిర్వహణలో లేని నిధిగా ఉందన్నారు. ఇకమీదట వడ్డీని ఎప్పటికప్పుడు కార్మికులకే చెల్లిస్తామని, 8 కోట్ల 40 లక్షల రూపాయల ఇపిఎఫ్ వడ్డీని చెల్లించామని చెప్పారు. ఇపిఎఫ్ వడ్డీని 8.8 శాతానికి పెంచామని గుర్తుచేశారు.