బిజినెస్

భవిష్యత్ కార్యాచరణపై ఈయు దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, జూన్ 25: యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలిగిన (బ్రెగ్జిట్) నేపథ్యంలో ఈయు వ్యవస్థాపక సభ్య దేశాలు శనివారం ఇక్కడ సమావేశమయ్యాయి. జర్మనీ విదేశాంగ మంత్రి ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్‌మియర్ పిలుపు మేరకు ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఇటలీ, బెల్జియం, లగ్జెంబర్గ్ దేశాల విదేశాంగ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 28 దేశాల కూటమి అయిన ఈయు నుంచి బ్రిటన్ బయటకువచ్చిన క్రమంలో మిగిలిన 27 దేశాల భవిష్యత్తుపై చర్చించారు. బెర్లిన్ శివారులోని ప్రభుత్వ అతిథిగృహం బోర్సిగ్ మాన్షన్‌లో జరిగిన ఈ సమావేశం అనంతరం స్టెయిన్‌మియర్ విలేఖరులతో మాట్లాడుతూ ‘బ్రెగ్జిట్‌కు మెజారిటీ బ్రిటనీయులు మద్దతు పలికిన నేపథ్యంలో వలసలు, నిరుద్యోగం వంటి కీలక అంశాలపై సభ్య దేశాల ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం ఈయుకు ఎంతైనా ఉంది.’ అన్నారు. ఈయులో బ్రిటన్ ఉండటం వల్ల సహచర సభ్య దేశాల నుంచి తమ దేశంలోకి పెద్ద ఎత్తున శరణార్థులు వలసలు వస్తున్నారని, దీనివల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని బ్రిటనీయులు ఆందోళన చెందే బ్రెగ్జిట్‌కు ఓటేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా దేశాల ప్రజల్లో కూడా వలసలు, నిరుద్యోగంపై ఉన్న అభిప్రాయాలను తెలుసుకుంటే మంచిదన్న వాదన తాజా ఈయు వ్యవస్థాపక సభ్య దేశాల సమావేశంలో వినిపించడం గమనార్హం. ఈయు భవిష్యత్తు కోసం 27 సభ్య దేశాలు ఏం ఆలోచిస్తున్నాయనేది తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తాము కూడా ఈయులోని 500 మిలియన్లకుపైగా పౌరుల అభిప్రాయాలను వినాలనుకుంటున్నామని చెప్పారు. ఫ్రాన్స్, బెల్జియంలలో తీవ్రవాద దాడులు చోటుచేసుకున్న నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనలు, శరణార్థుల వలసల సంక్షోభం, దక్షిణ ఐరోపాలోని యువత నిరుద్యోగ సమస్యపై ఈయు విధానకర్తల నుంచి సమాధానాలను తెలుసుకునే హక్కు ప్రజలకుందని వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతర పరిణామాల మధ్య ఈయు పురుడు పోసుకోగా, 1951లో యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీగా ఏర్పడింది. 1957లో యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీగా రూపాంతరం చెందింది. 1993 నవంబర్ 1న యూరోపియన్ యూనియన్‌గా ఏర్పడింది. ఫ్రాన్స్, బెల్జియం, లగ్జెంబర్గ్, ఇటలీ, నెదర్లాండ్స్, జర్మనీలు దీన్ని స్థాపించాయి. బలమైన ఆర్థిక వ్యవస్థలుగా మాత్రం ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలుండగా. మొదటి నుంచి ఈయులో అయిష్టంగానే ఉన్న బ్రిటన్.. అన్ని విషయాల్లోనూ అంటీముట్టనట్లుగానే వ్యవహరించింది. దీంతో ఫ్రాన్స్, జర్మనీలు ముందుండి యూనియన్‌ను నడిపిస్తున్నాయి. యూనియన్ ఉమ్మడి కరెన్సీ యూరోతో కూడా విబేధించి బ్రిటన్ తమ కరెన్సీగా పౌండ్‌ను కొనసాగిస్తోంది. అయతే ఈ 28 దేశాలన్నీ కూడా ఒక దేశం మాదిరిగానే ఉంటాయి. దీంతో బ్రిటన్ సామ్రాజ్యవాదానికి భంగంగా భావించిన బ్రిటనీయులు.. యూనియన్ తో చిన్న దేశాల తప్పులకు పెద్ద దేశాలు మూల్యం చెల్లించాల్సి వస్తోందన్న ఆలోచనలో పడ్డారు. తమ సామ్రాజ్యం ఇతరుల చెప్పుచేతల్లోకి వెళ్లిపోతోం దన్న భయాలే బ్రెగ్జిట్‌కు దారితీశాయ. అదీగాక ఈయులోని 28 దేశాలన్నీ కూడా ఒక దేశం మాదిరిగానే ఉండటం, ఒక దేశం నుంచి మరో దేశంలోకి రాకపోకలు స్వేచ్ఛగా జరగడంతో పొరుగు దేశాల నుంచి వలసలు పెరిగి దేశంలో నిరుద్యోగం పెరిగిపోయందన్న భావన బ్రిటన్ పౌరుల్లో బలంగా నాటుకుపోయంది.
మరోవైపు ఈయు నుంచి బ్రిటన్ వైదొలిగిన నేపథ్యంలో మున్ముందు ఆ దేశానికి తీవ్ర ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బ్రెగ్జిట్ కారణంగా బ్రిటన్ పౌండ్ విలువ 31 ఏళ్ల కనిష్టానికి పడిపోగా, స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు మాంద్యం పరిస్థితులు తప్పకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు బ్రిటన్ చుట్టుప్రక్కల దేశాలన్నీ కూడా ఈయులో సభ్య దేశాలే. దీంతో బ్రిటన్ ఒక్కటే ఈయులో లేకపోవడం వల్ల చుట్టుప్రక్కల దేశాలతో ఆర్థికపరమైన చిక్కులు వచ్చిపడవచ్చన్నది నిపుణుల వాదన. అలాగే ప్రపంచంలోనే అమెరికాకు పోటీగా అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న ఈయుతో ఆర్థిక సంబంధాలు పెట్టుకున్న ఇతర ఐరోపా దేశాలన్నీ కూడా బ్రిటన్‌ను పెద్దగా పట్టించుకోకపోవచ్చన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఈయుతో ఉన్న ఒప్పందాల దృష్ట్యా ఇది జరగవచ్చని విశే్లషిస్తున్నాయి. ఇదిలావుంటే గ్లోబల్ రేటింగ్ దిగ్గజం మూడీస్ తాజా బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్ ఔట్‌లుక్‌ను తగ్గించింది. మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్.. బ్రిటన్ రేటింగ్‌ను నిలకడ నుంచి ప్రతికూలానికి తీసుకెళ్లింది. దీర్ఘకాలంగా బ్రిటన్‌కు ఇబ్బందులు ఏర్పడవచ్చని అభిప్రాయపడింది.
ఇకపోతే ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనించిన బ్రెగ్జిట్‌పై బెట్టింగులు జోరుగా సాగాయి. రెఫరెండానికి ముందు ఈయులో బ్రిటన్ ఉంటుందనే అంచనాలు విస్తృతంగా వ్యక్తమైన నేపథ్యంలో అందుకు విరుద్ధంగా ఫలితాలు వెల్లడైనది తెలిసిందే. ఈ క్రమంలో బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బెట్టింగులు వచ్చాయి. కానీ బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటర్లు తీర్పునివ్వడంతో బుకీలకు లాభాల పంట పండింది. ఈయులో బ్రిటన్ కొనసాగుతుందని ఓ మహిళ ఏకంగా లక్ష పౌండ్లను బెట్టింగ్ వేసిందంటే అర్థం చేసుకోవచ్చు తాజా ఫలితాలతో బుకీలకు ఏ స్థాయిలో లాభాలు వచ్చాయో అన్నది. బ్రెగ్జిట్ రెఫరెండంలో అనుకూలంగా దాదాపు 52 శాతం ఓట్లు పోలైనది తెలిసిందే.

chitram జర్మనీ రాజధాని బెర్లిన్‌లో శనివారం నిర్వహించిన సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న ఈయు వ్యవస్థాపక సభ్య దేశాల విదేశాంగ మంత్రులు