బిజినెస్

ముప్పు తెస్తున్న ఉప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: దేశంలో విక్రయించే అప్పడాలు, సాస్‌లు, ఇతర ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో అత్యధిక స్థాయిలో ఉప్పు శాతం ఉందని, దీని కారణంగానే రక్తపోటు, గుండె పోటు, పక్షవాతం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయని తాజాగా జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది. మొత్తం 5,796 ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై జార్జి గ్లోబల్ హెల్త్ ఇండియా సంస్థ సర్వే జరిపింది. ఒకే రకమైన రెండు ఉత్పత్తుల్లో లవణాల శాతంలో ఎంతో తేడా ఉందని తెలిపింది. కొన్నిటిలో అయితే ఈ తేడా పది రెట్లకుపైనే ఉందని కూడా వెల్లడించింది. పైగా ఈ ఉత్పత్తుల ప్యాకెట్లపై పోషకాలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల భారత ఆహార భద్రత, ప్రమాణాలకు విరుద్ధంగానే వీటి విక్రయం జరుగుతోందని కూడా ప్రకటించింది. ప్రాసెస్ చేసిన అన్ని రకాల ఆహార పదార్థాల ప్యాకెట్లపై ఈ రకమైన సమాచారం ఉండటం తప్పనిసరి. మూడింట రెండొంతుల మేర ఈ ఉత్పత్తుల్లో లవణాల శాతానికి సంబంధించిన వౌలిక సమాచారం కూడా ఉండటం లేదని వెల్లడించింది. అప్పడాల వంటి వాటి తయారీలో వంద గ్రాములకు 1,219 మిల్లీ గ్రాముల మేర ఉప్పు వాడుతున్నారని తెలిపింది. ఇదిలాఉండగా, భారత్‌సహా ఆసియాలోని అభివృద్ధి చెందిన దేశాల్లో వాయు కాలుష్యం చాలా తీవ్రంగా ఉందని, దీనివల్ల రానున్న పాతిక సంవత్సరాల కాలంలో ముందస్తు మరణాల సంఖ్య ప్రస్తుత మూడు మిలియన్ల నుంచి నాలుగున్నర మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది.