బిజినెస్

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 27: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ బయటకురావడం (బ్రెగ్జిట్)తో శుక్రవారం భారీ నష్టాలకు లోనైనది తెలిసిందే. భారత్‌సహా ఆసియా, ఐరోపా స్టాక్ మార్కెట్లన్నీ కూడా తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ క్రమంలో సోమవారం భారతీయ సూచీలు కొంత నిలకడను సంతరించుకున్నాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 5.25 పాయింట్లు పెరిగి 26,402.96 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 6.10 పాయింట్లు అందుకుని 8,094.70 వద్ద నిలిచింది. శుక్రవారం సెనె్సక్స్ 605 పాయింట్లు, నిఫ్టీ 182 పాయింట్లు పడిపోయినది తెలిసిందే. ఇకపోతే హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఎఫ్‌ఎమ్‌సిజి, చమురు, గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్ల విలువ 2.01 శాతం నుంచి 1.03 శాతం వరకు పెరిగింది. ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా సూచీలు లాభపడగా, హాంకాంగ్, సింగపూర్ సూచీలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలు లాభపడితే, జర్మనీ సూచీ నష్టపోయింది.
ప్రభుత్వ బాండ్లకు విశేష స్పందన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రుణ సెక్యూరిటీలకు విదేశీ మదుపరుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ కనిపించింది. సాధారణ ట్రేడింగ్ కార్యకలాపాల అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఈ-బిడ్ వేదికపై జరిగిన వేలంలో 6,949 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లకు 9,348 కోట్ల రూపాయలకు సమానమైన బిడ్లు దాఖలయ్యాయి.