బిజినెస్

మార్చికల్లా 22 వేలకు సెనె్సక్స్ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 27: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ముగింపు నాటికి బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 22,000 స్థాయికి పడిపోతుందని ఓ నివేదిక అంచనా వేసింది. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ తప్పుకున్న (బ్రెగ్జిట్) నేపథ్యంలో సెనె్సక్స్ భారీగా పతనం కావచ్చని ఆర్థిక సేవల సంస్థ అంబిత్ క్యాపిటల్ అంచనా వేసింది. నిజానికి సెనె్సక్స్ వచ్చే ఏడాది మార్చికల్లా 29,500 స్థాయికి చేరుతుందని అంచనా వేసినప్పటికీ బ్రెగ్జిట్ కారణంగా ఈ అంచనాను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. బ్రెగ్జిట్‌తో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడటం, ఐరోపా దేశాల్లో మాంద్యం పరిస్థితులు తలెత్తడం జరగవచ్చని చెప్పిన అంబిత్ క్యాపిటల్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీకాలం ముగియడం వంటివి విదేశీ మదుపరులను దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు ఉసిగొల్పవచ్చంది. కాగా, డాలర్ విలువ పెరగడం చైనా జిడిపి వృద్ధికి ఓ చక్కని అవకాశంగా అంబిత్ క్యాపిటల్ అభిప్రాయపడింది. అలాగే బ్రెగ్జిట్‌తో డాలర్‌పై పెట్టుబడులు పెరగవచ్చని, మదుపరులు ఆ దిశగా అడుగులు వేస్తారని కూడా పేర్కొంది. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్న క్రమంలో మదుపరులు తమ పెట్టుబడులకు ప్రత్యామ్నా యంగా బంగారాన్ని ఎంచుకుంటుండటంతో బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతున్నది తెలిసిందే.