బిజినెస్

ఎయిర్‌ఏషియా ప్రోత్సాహక ఆఫర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 27: చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా.. సోమవారం దేశీయ ప్రయాణికుల కోసం పలు ప్రోత్సాహక ఆఫర్లను ప్రకటించింది. 786 రూపాయల ప్రారంభ చార్జీ (అన్ని పన్నులతోసహా)తో దేశంలోని వివిధ ప్రాంతాలకు టిక్కెట్లను తెచ్చింది. ఈ చార్జీ రానుపోను ప్రయాణానికి కాదు. ఒకవైపు మాత్రమే. వచ్చే నెల 3 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ బుక్ చేసుకున్నవారు ఎయిర్‌ఏషియా విమానాలు తిరిగే మార్గాల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 మధ్య ప్రయాణం చేసే వీలుంటుంది. ఈ మేరకు ఓ ప్రకటనలో ఎయిర్‌లైన్ తెలిపింది. కాగా, ఆక్లాండ్, మారిషస్, గాంగ్జూ తదితర అంతర్జాతీయ ప్రాంతాలకూ ఎయిర్‌ఏషియా తక్కువ ధరలతో టిక్కెట్లను ఆఫర్ చేస్తోంది. ఇవి కూడా ఒకవైపు ప్రయాణానికి పరిమితమైనవే. వీటి ప్రారంభ ధర 2,999 రూపాయలు. ఐ5, ఎకె, ఎఫ్‌డి, డి7 కోడ్స్ కలిగిన అన్ని ఎయిర్‌ఏషియా, ఎయిర్‌ఏషియా ఎక్స్ విమానాలకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని సంస్థ స్పష్టం చేసింది. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కబాలీ’ సినిమాతో ఇటీవల ఎయిర్‌ఏషియా టై-అప్ అయ్యింది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్‌కు ‘ఫ్లై లైక్ ఎ సూపర్‌స్టార్’ పేరుతో తాజా ఆఫర్లను తెచ్చినట్లు ఎయిర్‌ఏషియా ఇండియా సిఇఒ అమర్ అబ్రోల్ తెలిపారు.