బిజినెస్

పాపం.. పౌండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 27: యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలిగిన (బ్రెగ్జిట్) నేపథ్యంలో ఆ దేశ పౌండ్ విలువ అంతకంతకూ దిగజారుతోంది. రెఫరెండంలో మెజారిటీ బ్రిటనీయులు బ్రెగ్జిట్‌కు మద్దతు పలకడంతో శుక్రవారం పౌండ్ విలువ 31 ఏళ్ల కనిష్టానికి పడిపోయినది తెలిసిందే. తాజాగా సోమవారం కూడా దాదాపు 30 ఏళ్లకుపైగా కనిష్టానికి పౌండ్ విలువ పతనమైంది. బ్రిటన్ ఆర్థిక, రాజకీయ రంగాల్లో నెలకొన్న అనిశ్చితే ఇందుకు కారణం. ఈయు నుంచి బ్రిటన్ వైదొలగడంతో వివిధ దేశాలతో వాణిజ్య, వ్యాపార ఒప్పందాలను మళ్లీ కుదుర్చుకోవాల్సి వస్తుండటం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతోంది. ఇప్పటికే పలు రేటింగ్ ఏజెన్సీలు బ్రిటన్ ఔట్‌లుక్ స్థాయిని తగ్గించాయి. అలాగే రాజకీయ సంక్షోభం సంకేతాలు కూడా కనిపిస్తుండటం పౌండ్ విలువను క్షీణింపజేస్తున్నాయి. ఇక సోమవారం ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చితే పౌండ్ విలువ 1.3222 డాలర్లకు పడిపోయింది. 1985 సెప్టెంబర్ నుంచి ఈ స్థాయికి పౌండ్ విలువ దిగజారడం ఇదే ప్రథమం. కాగా, బ్రెగ్జిట్ నేపథ్యంలో పౌండ్ విలువ రూపాయితో పోల్చితే కూడా 10 రూపాయల మేర దిగజారింది. మరోవైపు బ్రిటన్ ఆర్థిక మంత్రి జార్జ్ ఆస్బర్న్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఇబ్బందేమీ లేదని, బ్రిటిష్ ఎకానమీ బలమైనదని, బ్రెగ్జిట్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అన్నారు.