బిజినెస్

హ్యాకింగ్‌కు గురైన పిచాయ్ కోరా అకౌంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 27: గూగుల్ సిఇఒ, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ కోరా అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఇంతకుముందు ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్‌బర్గ్ ట్విట్టర్, పింటరెస్ట్ అకౌంట్లను హ్యాక్ చేసినవాళ్లే ఇప్పుడు పిచాయ్ కోరా అకౌంట్‌ను హ్యాక్ చేయడం గమనార్హం. అవర్‌మైన్ టీమ్‌గా పిలువబడే ఈ హ్యాకర్ గ్రూప్.. పిచాయ్ అకౌంట్ ద్వారా కోరాపై సందేశాలను కూడా పంపించారు. ఆదివారం పిచాయ్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌పై కోరా సందేశాలు కనిపించాయి. కాగా, సుందర్ పిచాయ్‌కి 5,08,000 ఫాలోయర్లున్నారు. మరికొందరు ప్రముఖుల ఖాతాలనూ హ్యాకింగ్ చేసినట్లు అవర్‌మైన్ టీమ్ గతంలో ప్రకటించినది తెలిసిందే. ఇందులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, సాఫ్ట్‌వేర్ దిగ్గజం బిల్‌గేట్స్ ట్విట్టర్ ఖాతా కూడా ఉండటం గమనార్హం. ప్రముఖ అమెరికన్ గాయని కటీ పెర్రీ ట్విట్టర్ ఖాతా కూడా హ్యాకింగ్‌కు గురవగా, తాజాగా ఆ జాబితాలో సుందర్ పిచాయ్ కూడా చేరిపోయారు. జూకర్‌బర్గ్ ట్విట్టర్, పింటరెస్ట్ ఖాతాలూ హ్యాకింగ్‌కు గురైనట్లు ఈ నెలలోనే తెలిసింది. జుకర్‌బర్గ్ 2012 లింకెడిన్ ఖాతా నుంచి పాస్‌వర్డ్‌లను పొందినట్లు హ్యాకర్ గ్రూప్ అవర్‌మైన్ టీమ్ ప్రకటించింది. మొత్తానికి హ్యాకింగ్ మహమ్మరి సాఫ్ట్‌వేర్ దిగ్గజాలనూ వదలడం లేదు.