బిజినెస్

ఇక వృద్ధిపథంలో ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: ఎగుమతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాబోయే నెలల్లో దేశీయ ఎగుమతులు వృద్ధిపథంలో వెళ్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు వాణిజ్య కార్యదర్శి రీటా టియోటియా. 2014 డిసెంబర్ నుంచి భారత ఎగుమతులు క్రమేణా క్షీణిస్తున్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల మేలో ఎగుమతులు పుంజుకున్న సంకేతాలు కనిపించాయి. దీంతో తాము చేపట్టిన చర్యలు ప్రభావం చూపుతున్నాయని, మున్ముం దు ఎగుమతులు మరింతగా పెరుగుతాయని పిటిఐతో మాట్లాడుతూ టియోటియా అన్నారు. మే నెలలో ఇంజినీరింగ్ 2.2, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 24.34 శాతం పెరిగాయి.