బిజినెస్

నాలుగో రోజూ మార్కెట్ల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 30: బ్రెగ్జిట్ భయాలు క్రమంగా తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్లు సైతం కుదుటపడిన నేపథ్యంలో దఏశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరసగా నాలుగో రోజు కూడా లాభాల బాటలో సాగాయి. సెనె్సక్స్ 245 పాయింట్లు పెరిగడంతో సూచీ తిరిగి 27 వేల పాయింట్ల దరిదాపులకు చేరుకుంది. నరేంద్ర మోదీ 2014లో అదికారం చేపట్టిన తర్వాత గత రెండేళ్లకాలంలో మార్కెట్లు అత్యంత పటిష్ఠమైన రీతిలో ముగిసిన త్రైమాసికం ఇదే కావడం గమనార్హం. నిఫ్టీ ఈ ఏడాది తొలిసారిగా 8,300 పాయింట్ల స్థాయిని దాటింది. ఎఫ్‌డిఐ నిబంధనలను సడలించడం, ఏడవ వేతన సంఘం సిఫార్సులకు ఆమోదముద్ర వేయడం, ఖనిజాల అనే్వషణ విధానానికి ఆమోదం తెలపడం, కొత్త షాప్స్, ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టాన్ని ఆమోదించడం లాంటి పలు చర్యలను ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకోవడం మదుపరుల్లో ఉత్సాహాన్ని తీసుకు వచ్చిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. జూన్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌ల ముగింపు చివర్లో మదుపరులు కొనుగోళ్లు జరపడం కూడా మార్కెట్లకు ఊతమిచ్చింది. రాజ్యసభలో మారిన బలాబలాలు సైతం వస్తుసేవల పన్నుకు వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదం లభించగలదన్న నమ్మకం మదుపరుల్లో కలగడం బలమైన సానుకూల అంశం అయింది. ఫలితంగా సెనె్సక్స్ 259.33 పాయింట్లు పెరిగి 26,999.72 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు రోజుల్లోసెనె్సక్స్ 342 పాయింట్లకు పైగా లాభపడింది. ఒక దశలో 8,300 పాయింట్ల స్థాయిని తాకిన నిఫ్టీ చివరికి 83.75 పాయింట్ల లాభంతో 8287.75 పాయింట్ల వద్ద ముగిసింది. ఏడో వేతన కమిషన్ సిఫార్సులను అమలు చేయడం వల్ల అమ్మకాలు భారీగా పెరగవచ్చని భావిస్తున్న ఆటో, వినియోగ వస్తువుల రంగాలకు డిమాండ్ బాగా లభించింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లో ముగియగా, బ్రెగ్జిట్ ప్రభావం ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో ఐరోపా మార్కెట్లు సైతం లాభాల్లో మొదలైనాయి.