బిజినెస్

‘బయ్యారం’ ఉక్కుకు కట్టుబడి ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని, చివరకు ప్రధాని మోడితో ఈ విషయంపై చర్చించక పోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ ఉక్కు ప్లాంట్ ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందన శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డితో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో ఇందన, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో ప్లాంట్ ఏర్పాటుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నట్ట తెలిపారు. ఎట్టిపరిస్థితిలో ప్లాంట్ ఏర్పాటును చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అధ్యయనాన్ని చేసేందుకు తెలంగాణ గనుల శాఖ, టీఎస్‌ఎండిసీ, సింగరేణి సంస్థ అధికారులు, ఇందన, పరిశ్రమల శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కమిటీ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమి, నీరు, బొగ్గు, విద్యుత్ వంటి కీలకమైన అంశాలపై సమగ్ర అధ్యయణం చేసి నివేదికను ఇస్తుందని వివరించారు. నెలరోజుల్లో కమిటీ నివేదిక అందించాలని గడువు విధించనున్నట్టు నివేదిక అందిన వెంటనే ప్లాంటు ఏర్పాటుపై ముందుకు వెళతామని అన్నారు. పునర్విభజన చట్టంలో రూపొందించిన విధంగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు బాధ్యత కేంద్రానిదని, కాగా గత నాలుగేళ్లుగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలదన్నారు. ప్లాంట్‌ను నెలకొల్పాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. బయ్యారంలో అందుబాటులో ఉన్న స్టీల్ నాణ్యత సరిగా లేదని వౌళిక పెడుతున్నారని అన్నారు. ఎలాంటి ఇనుము నిక్షేపాలు, బోగ్గు లేని విశాఖలో దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన భారీ ప్లాంట్ విజయవంతంగా కొనసాగుతుందన్న విషయాన్ని గుర్తించడం లేదని అన్నారు. తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే ఈ ప్లాంటు ఏర్పాటుపైన ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు పోతుందన్నారు. ప్లాంటు ఏర్పాటుకు అనేక సానుకూల అంశాలు ఉన్నా, కేంద్రం నిర్లక్ష్యం కారణంగా సాధ్యం కావడం లేదని ఆయన కేంద్రం ముందుకు వచ్చినా రాకున్నా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
ప్లాంట్ ఏర్పాటు కోసం ఉన్నతాధికారులతో అధ్యయణ కమిటీ వేసి నెలరోజుల్లో నివేదిక అందించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో ప్లాంట్ ఏర్పాటుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిపారు.

చిత్రం..బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్