బిజినెస్

5జి సర్వీసుల కోసం అందుబాటులోని ఆరువేల ఎంహెచ్‌జడ్ స్పెక్ట్రమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: వచ్చే తరం మొబైల్ సేవల కోసం 6000 ఎంహెచ్‌జడ్ స్పెక్ట్రమ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు టెలికాం మంత్రిత్వశాఖకు చెందిన 5జి కమిటీ పేర్కొంది. ఈ నివేదికను కేంద్రానికి సమర్పించారు. ఈ నివేదికను ఆమోదిస్తే దేశంలో అతి పెద్ద స్పెక్ట్రమ్ అందుబాటులోకి వస్తుంది. ఈ వివరాలను నిపుణుల కమిటీ సభ్యుడు ఆరోగ్యస్వామి పాల్‌రాజ్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న డాటా స్పీడ్ 50 శాతం అదనంగా పెరుగుతుందన్నారు. కొత్త సర్వీసులు పెంచాలంటే స్పెక్ట్రమ్ అవసరమని ఆయన చెప్పారు. 2016లో రూ.5.63 లక్షల కోట్ల విలువైన 2,354,55 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీలను వేలం వేశారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్ సిగ్నల్స్ 800 ఎంహెచ్‌జడ్ నుంచి 2600 ఎంహెచ్‌జడ్ బాండ్ మధ్య ప్రసారమవుతున్నాయి. 5జి సర్వీసుల్లో 11 బ్యాండ్స్ ఉన్నాయి. ఇందులో 4 బ్యాండ్లను వెంటనే అమలులోకి తీసుకురానున్నారు. స్పెక్ట్రమ్ వల్ల వౌలిక సదుపాయాల ఖర్చు తగ్గుతుందన్నారు. మొబైల్ సర్వీసులకే కాకుండా పవర్ గ్రిడ్స్, స్మార్ట్ సిటీస్, వ్యవసాయం, బ్యాంకింగ్, రైల్వేలు, ఆరోగ్యం తదితర రంగాలకు 5 జి సేవలు విస్తరిస్తాయన్నారు. 2020 నాటికి 5జి సర్వీసులు అందుబాటులోకి వచ్చే విధంగా కేంద్రం డెడ్ లైన్ విధించింది.