బిజినెస్

వాణిజ్య యుద్ధ భయాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య యుద్ధం వస్తుందేమోనని తాజాగా నెలకొన్న భయాందోళనలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల కదలికలు, రుతుపవనాల పురోగతి వంటి అంశాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా. చైనా నుంచి దిగుమతి అయ్యే సరుకులపై అమెరికా తాజాగా దిగుమతి సుంకాలను పెంచడం, దీంతో ప్రతి చర్యకు దిగుతామని చైనా హెచ్చరించడం వంటి పరిణామాలు స్టాక్ మార్కెట్ కదలికలపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. 3అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం సంభవిస్తుందేమోననే ఆందోళన రానున్న రోజుల్లో స్టాక్ మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతుంది2 అని కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ పరిశోధన విభాగం వైస్ ప్రెసిడెంట్ టీనా విర్మాని పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాల వెల్లడి, స్థూలార్థిక గణాంకాలు, రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన ప్రకటన వంటివి పూర్తికావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో మందకొడి గమనం మొదలవుతోందని నిపుణులు భావిస్తున్నారు. 3త్రైమాసిక ఫలితాలు, రుతుపవనాల గమనంపై అంచనాలు, ఇటీవలి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు, ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు ఇప్పటికే పూర్తి కావడంతో దేశీయ స్టాక్‌మార్కెట్ల ఫండమెంటల్‌లు ప్రస్తుతానికి వెనుకపట్టు పడతాయి. అందరి కళ్లూ ప్రపంచ పరిణామాలపైనే కేంద్రీకృతమయి ఉంటాయని మేము భావిస్తున్నాం. చైనా దిగుమతులపై అమెరికా తాజాగా 50 బిలియన్ డాలర్ల మేరకు సుంకాలు విధించడంతో వాణిజ్య యుద్ధ భయాలు తలెత్తడం, ముడి చమురు ధరల కదలికలు వంటి అంశాలపై మదుపరులు దృష్టి సారిస్తారు2 అని ఎపిక్ రీసెర్చ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ముస్త్ఫా నదీమ్ పేర్కొన్నారు. 3రుతుపవనాల పురోగతితో పాటు ముడి చమురు ధరల హెచ్చు తగ్గులను మదుపరులు గమనిస్తుంటారు2 అని హెమ్ సెక్యూరిటీస్ డైరెక్టర్ గౌరవ్ జైన్ పేర్కొన్నారు. 3వాణిజ్య వివాదాల ఉద్రిక్తతలు సమీప భవిష్యత్తులో మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. చమురు సరఫరాల కోతను సడలించే అంశంపై నిర్ణయం తీసుకోనున్న ఒపెక్, రష్యాల సమావేశంపై ఈ వారం మదుపరులు దృష్టి సారించనున్నారు2 అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 178.47 పాయింట్లు (0.50 శాతం) పుంజుకొని, 35,622.14 పాయింట్ల వద్ద ముగిసింది.