బిజినెస్

మూడేళ్లు చాలా తక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: ఆర్‌బిఐ గవర్నర్ పదవికి మూడేళ్ల కాలం చాలా తక్కవని రఘురామ్ రాజన్ అభిప్రాయ పడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనుసరిస్తున్న పద్ధతులు భారత్‌లో కూడా అనుసరిస్తే బాగుంటుందని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలు, బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు లాంటి అంశాలపై ఆర్థిక శాఖపై పార్లమెంటు స్థారుూ సంఘం సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా స్థారుూసంఘం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రాజన్ ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ‘ఆర్‌బిఐ గవర్నర్‌కు మూడేళ్ల కాలపరిమితి చాలా తక్కువ. ఇది కనీసం అయిదేళ్లు ఉండాలి’ అని అమెరికా ఫెడరల్ రిజర్వ్ అనుసరిస్తున్న విధానాలను ఉటంకిస్తూ రాజన్ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆర్‌బిఐ గవర్నర్‌గా రాజన్ కాలపరిమితి వచ్చే సెప్టెంబర్ 4తో ముగుస్తున్న విషయం, తాను మరోసారి ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉండబోనని కూడా ఆయన స్పష్టం చేయడం విదితమే. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాజన్ దేశ ఆర్థిక రంగం పరిస్థితి, ఆర్‌బిఐలో సంస్కరణలు, పునర్వ్యవస్థీకరణ, దేశంలో బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, అందుకు తీసుకోవలసిన చర్యల గురించి సభ్యులకు వివరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మొండి బకాయిల సమస్యను పరిష్కరించడానికి తీసుకున్న వివిధ చర్యలను కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఆ కమిటీకి రాజన్ వివరించినట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి. 2016 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతానికి పెరిగిన నిరర్థక ఆస్తులు(ఎన్‌పిఏ)లు 2016-17 ఆర్థిక సంవత్సరంలో 9.3శాతానికి పెరిగే అవకాశముందని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాజన్ గురువారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైనారు. వడ్డీ రేట్లను ఆర్‌బిఐ నిర్ణయిస్తున్న ప్రస్తుత విధానం స్థానంలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్న తరుణంలో రాజన్ జైట్లీతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఆర్‌బిఐ, ఆర్థిక శాఖతో సమావేశం కావడంలో విశేషమేమీ లేదని సమావేశం అనంతరం విలేఖరులతో రాజన్ వ్యాఖ్యానించడం విశేషం.
రాజన్ గొప్ప వ్యక్తి
కాగా, రాజన్ గొప్ప వ్యక్తి అంటూ మన దేశంలో పర్యటిస్తున్న ప్రపంచ బ్యాంక్ జిమ్ యోంగ్ కిమ్ గురువారం పొగడ్తలతో ముంచెత్తారు. దృఢమైన దేశ నాయకత్వం వల్లనే ఆర్‌బిఐ స్వతంత్ర వ్యవస్థగా మనగలుగుతోందని ఆయన అన్నారు. మరో వైపు రాజన్ స్థానంలో సమర్థుడైన వ్యక్తి ఆర్‌బిఐ గవర్నఱ్ పదవిని చేపడతారన్న ఆశాభావాన్ని సిఐఐ అధ్యక్షుడు నౌషాద్ ఫోర్బ్స్ వ్యక్తం చేశారు.

చిత్రం.. ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్