బిజినెస్

ఇక ప్రతి చుక్కా లెక్కే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 19: మున్సిపాల్టీలు, నగరాల్లో ఆదాయం పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నీటి వినియోగంపై దృష్టిసారించింది. పౌరులు వినియోగించే నీటి ఆధారంగా పన్ను వసూలుచేయడంతోపాటు, ఇళ్లకు విధించే ఆస్తి పన్ను ఆధారంగా యూజర్ ఛార్జీలు వసూలుచేయనుంది. ఇందుకు అవసరమైన రంగం సిద్ధంచేసింది. ఇదే విధానాన్ని రాష్ట్రంలోని పట్టణాలతోపాటు గ్రామాల్లో కూడా అమలు చేయనున్నట్టు తెలిసింది.
రాష్ట్రంలో 110 పురపాలక సంఘాలు ఉన్నాయి. వాటిలో 14 కార్పొరేషన్లు, 96 మున్సిపాల్టీలు (నగర పంచాయతీలతో కలిపి) ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.633.81 కోట్లు ఆస్తి పన్ను రూపేణా మున్సిపాల్టీలకు ఆదాయం సమకూరుతోంది. అలాగే నీటి పన్ను ద్వారా రూ.71.62 కోట్లు వస్తోంది. ప్రతీ మున్సిపాల్టీలో కనీసం రూ.2 కోట్లు పైనే ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. వసూలు చేస్తున్న ఆస్తి పన్ను కేవలం ఆయా పట్టణాల్లోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు తదితరాలకు నీటిని సరఫరా చేయడానికి వినియోగించే విద్యుత్ ఛార్జీలకే సరిపోతుందనేది ప్రభుత్వ ఆలోచన. ఈ నేపథ్యంలో నీటి వినియోగం ఆధారంగా వారిపై యూజర్ ఛార్జీలు విధించాలని నిర్ణయించింది.
మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో యూజర్ ఛార్జీల విధింపు కోసం వినియోగదారులను ప్రభుత్వం నాలుగు విభాగాలుగా విభజించింది. నెల వారీ ఎంత మొత్తంలో నీటిని వినియోగిస్తున్నారో లెక్కిస్తారు. విభజించిన నాలుగు విభాగాల్లో ఆస్తిపన్ను ఎంత చెల్లిస్తున్నారన్న వివరాలు సేకరిస్తారు. సామాన్యులు ఇంటి పన్ను తక్కువగానే ఉంటుంది. పరిశ్రమలు, వాణిజ్యం, అపార్ట్‌మెంట్లకు ఆస్తి పన్ను అధికంగానే ఉండటం వల్ల యూజర్ ఛార్జీలు కూడా అధికంగానే విధిస్తారు. ప్రస్తుతం ఇంటి పన్ను కనీసం రూ.250 ఉంటే ప్రస్తుతం విధించే నీటి పన్నులో యాభై శాతం యూజర్ ఛార్జీ రూపంలో వసూలుచేస్తారు. ఆస్తి పన్ను అంతకన్నా ఎక్కువగా ఉంటే వంద శాతం ఛార్జీలు వసూలుచేస్తారు. దీనికి అదనంగా వినియోగించే నీటిని లెక్కించి, దాని ఆధారంగా నీటి పన్ను విధిస్తారు. అపార్ట్‌మెంట్లకు సరఫరా చేసే నీటిని కిలో లీటర్ల రూపంలో కొలుస్తారు. భవన సముదాయంలో అధికంగా ఇళ్లు, గదులు, ఉండటం వల్ల వినియోగం ఎక్కువగా ఉంటోంది. అపార్ట్‌మెంట్లకు ఆస్తి పన్నుపై 150 శాతం పెంచి, ఛార్జీలు నిర్ణయిస్తారు. వాణిజ్య విభాగం పరిశీలిస్తే వీటి పరిధిలోకి వచ్చే హోటల్స్, రెస్టారెంట్లు, బార్లకు 200 శాతం యూజర్ ఛార్జీలు నిర్ణయిస్తారు. వీటి పరిధిలో ఉన్న వారు ఉపయోగించే పైపుల ఆధారంగా నీటి వినియోగాన్ని లెక్కిస్తారు. పరిశ్రమలకు 150 శాతంగా నిర్ణయించి, స్వయంగా సమృద్ధి రేటును పరిగణలోకి తీసుకుని ఛార్జీలు ఖరారు చేస్తారు. ఈవిధంగా ప్రభుత్వం మున్సిపాల్టీల్లోని ఆదాయ వనరులను పెంచుకునేందుకు అనేక వ్యూహాలను అమలు చేస్తోంది. ఇటీవలే ప్రైవేటు సంస్థలతో భవనాల కొలతలను కొలిచి మరుగుదొడ్డి, వంట గదెకు కూడా పన్నులు పెంచేసేంది. ఇప్పుడు దాహార్తిని తీర్చుకోవడానికి పౌరులు తాగే ప్రతీ చుక్క నీటిని లెక్కించి ఆదాయాన్ని పెంచుకుంటోంది.