బిజినెస్

విత్తనాభివృద్ధి హబ్‌గా ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: విత్తనాభివృద్ధి హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో మెగా సీడ్ పార్కు ముందుకు తీసుకెళ్లడానికి చేపట్టే ప్రతి చర్యను స్వాగతిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం నగరంలోని ఓ సమావేశ మందిరంలో ‘మెగా సీడ్ పార్కు’ కార్యాచరణ ప్రణాళికపై నిర్వహించిన కార్యశాల, విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు స్నేహపూర్వక విధానంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి దిశానిర్దేశంలో మెగా సీడ్ పార్కు ప్రాజెక్టును సాధించడంలో చొరవ చూపిందన్నారు. దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయిలో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తికి భవిష్యత్‌లో కేంద్రం కానుందని ఆయన తెలిపారు. రాబోయే రెండేళ్లలో మంచి ప్రణాళికలతో విలువైన సూచనలు, సలహాలతో మేలైన విత్తనాలను అభివృద్ధి చేయడంలో వ్యవసాయ సంఘాలు, రైతు ఉత్పత్తుల సంస్థలు (ఎఫ్‌సీఓ), విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ పరిశ్రమలు, వ్యవసాయ, ఉద్యానవన రంగాలు, స్వచ్ఛంద సంస్థల విభాగాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ నిపుణులు భాగస్వాములు కావడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి నేతృత్వంలో అమెరికాలోని ఐయోవా స్టేట్ యూనివర్శిటీని సందర్శించి అక్కడి వ్యవస్థను అధ్యయనం చేశామన్నారు. మెగా సీడ్ పార్కు ఏర్పాటులో ప్రైవేట్ పరిశ్రమల అభివృద్ధి అవకాశాలను, సాంకేతిక సౌకర్యాల కోసం కొన్ని పరిశ్రమలను పరిశీలించామన్నారు. భవిష్యత్‌లో నాణ్యమైన విత్తనోత్పత్తులకు ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచనా విధానమన్నారు. త్వరలోనే మెగా సీడ్ పార్కుకు పూర్తిస్థాయి కార్యనిర్వాహణాధికారిని నియమిస్తామన్నారు. కర్నూలు జిల్లాలో 600 ఎకరాల్లో మెగా సీడ్ పార్కు ఏర్పాటు చేయడం ద్వారా ఒక నూతన ఉత్తేజాన్ని అందిస్తామన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించామని, ఇక్కడి పరిస్థితుల కనుగుణంగా డీపీఆర్‌ను రూపుదిద్దామన్నారు. త్వరలోనే 4వ విడత రైతు రుణమాఫీ చేస్తామని మంత్రి వివరించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీ రాజశేఖర్ మాట్లాడుతూ ఐయోవా స్టేట్ యూనివర్శిటీ ప్రతినిధులతో ఈ కార్యశాలలో చేపట్టాల్సిన పూర్తి అంశాలను అధ్యయనం చేయడం ద్వారా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ డీ మురళీధరరెడ్డి మాట్లాడుతూ విత్తనాల ఉత్పత్తిలో 25 శాతం, 75 శాతం ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నాయని, అయితే ప్రైవేట్ రంగంలోని ఉత్పత్తిలో 57 శాతం స్వయం సిద్ధంగా నిర్వాహణా సామర్ధ్యంలేని వారున్నారన్నారు. ఆ దిశలో మెగా సీడ్ పార్కును అభివృద్ధి చేయాలని, ప్రపంచ స్థాయి విత్తనాభివృద్ధి చేపట్టాలని ఆలోచనతో ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కమిషనర్ కేవీవీ సత్యనారాయణ, ప్రధాన వక్తగా ఐయోవా స్టేట్ యూనివర్శిటీకి చెందిన కేఎస్ వరప్రసాద్ వ్యవహరించారు. ఐయోవా ప్రతినిధులు జీ దిలీప్ కుమార్, గ్యారీ ముంక్ వోల్డ్, గ్యారీ బిల్లుప్స్, ఏపీఏఏఆర్‌ఐ బ్యాంకాక్ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి కే రవి, ఐఆర్‌ఆర్‌ఐ ఫిలిప్పైన్స్ థీమ్ లీడర్ అరవింద్ కుమార్, సీవైఎంఎంఐటీ ప్రతినిధులు హాజరయ్యారు.