బిజినెస్

మెడ్‌టెక్ జోన్‌తో ఏపీ రూ.2వేల కోట్ల ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 21: దేశంలోనే తొలి వైద్య పరికరాల తయారీ కేంద్రం మెడ్‌టెక్ జోన్‌లో పలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన పలువురు పారిశ్రామిక వేత్తలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. మెడ్‌టెక్ జోన్‌లో రూ.2వేల కోట్లతో 10 కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు.విశాఖలో గురువారం జరిగిన ఏపీ హెల్త్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతరం మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులు, మెడికల్ యూనిట్లు స్థాపించే పారిశ్రామిక వేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్‌లో పాల్గొన్నారు. సుమారు 30 కంపెనీల నుంచి ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. మెడాల్ హెల్త్‌కేర్, అపోలో హాస్పిటల్స్, భావజ్ మెడిటెక్, జైనా మెడిటెక్, లైఫ్ ఆన్ మాన్యుఫాక్చరర్స్, రోబోనిక్ ఇండియా, బోస్టన్ ఐవీ హెల్త్‌కేర్, జెపీడీ ప్రిసీషస్, బెక్ వ్వెరల్ మెడికల్ సిస్టమ్స్, మోల్ బియో డయాగ్నస్టిక్స్ తదితర కంపెనీలు తమ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. అంతకు ముందు హెల్త్ ఫెస్టివల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌ఫోను చంద్రబాబు ప్రారంభించారు.
కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు గంటా శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆరోగ్య సలహదారు జితేందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.