బిజినెస్

భారత్‌కు అండదండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: పర్యావరణ సమస్యలను అధిగమించడంలో స్థిరమైన పురోభివృద్ధి కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలిచి పూర్తి తోడ్పాటును అందజేస్తామని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యోంగ్ కిమ్ స్పష్టం చేశారు. వాతావరణంలో మార్పులు తీసుకొచ్చేందుకు భారత్ లాంటి వర్థమాన దేశాలు చేపట్టిన ప్రాజెక్టులకు ఇతోధికంగా ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే పలుమార్లు ఉద్ఘాటించడంతో కిమ్ ఈ హామీ ఇచ్చారు. గురువారం ఆయన న్యూఢిల్లీలో మోదీతో సమావేశమయ్యారు. వ్యాపారాన్ని సులభతరం చేయడంలో, ప్రత్యేకించి లాజిస్టిక్స్ రంగంలో భారత్ ఎంతో వేగవంతంగా పురోగమిస్తోందని కిమ్ ఈ సందర్భంగా ప్రశంసించారని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచ బ్యాంకుతో భారత్ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన మార్గాల గురించి ఈ భేటీలో చర్చించామని మోదీ ట్వీట్ చేశారు. అలాగే సహకారాన్ని పెంపొందించుకునేందుకు గల అవకాశాలతో పాటు పలు ఇతర అంశాల గురించి కూడా మోదీ, కిమ్ చర్చలు జరిపారని పిఎంఓ పేర్కొంది. మన దేశంలో పలు ప్రాజెక్టులకు, ప్రత్యేకించి స్మార్ట్ సిటీలు, గంగానది ప్రక్షాళన, వృత్తి నైపుణ్య అభివృద్ధి, స్వచ్ఛ భారత్ తదితర ప్రాధాన్య రంగాలకు ప్రపంచ బ్యాంకు తోడ్పాటును కొనసాగిస్తుండటం పట్ల మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారని పిఎంఓ వివరించింది.

చిత్రం.. ఢిల్లీలో గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు కిమ్