బిజినెస్

మార్కెట్లకు మళ్లీ నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 21: రెండు రోజుల పాటు లాభపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ బలహీనపడ్డాయి. గురువారం తొలుత మార్కెట్లు లాభపడినప్పటికీ, ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న అనిశ్చితికి తోడు దేశీయంగా స్థూల ఆర్థిక గణాంకాలు ప్రతికూలంగా ఉండటంతో మదుపరులు కొనుగోళ్లకు వెనుకంజ వేయడంతో చివరకు నష్టాలతో ముగిశాయి. విదేశీ ఫండ్‌ల పెట్టుబడుల ఉపసంహరణ నిరంతరాయంగా కొనసాగడంతో పాటు రూపాయి బలహీనపడటం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో మార్కెట్ కీలక సూచీలు పడిపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ గురువారం ఉదయం జరిగిన లావాదేవీలలో 131 పాయింట్లు పుంజుకున్నప్పటికీ, తరువాత ఊగిసలాటలో జరిగిన లావాదేవీలలో ఆ పెరుగుదలను నిలుపుకోలేకపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 114.94 పాయింట్ల (0.32 శాతం) దిగువన 35,432.39 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ గురువారం 10,809.60- 10,725.90 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 30.95 పాయింట్ల (0.29 శాతం) దిగువన 10,741.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలలో నెలకొన్న అనిశ్చితి కారణంగా అనేక ఆసియా, యూరోపియన్ మార్కెట్లలో లావాదేవీలు దిగువ స్థాయిలలో జరిగాయి. ఇదిలా ఉండగా, యూరోపియన్ యూనియన్, చైనాల బాటలో భారత్ కూడా గురువారం అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగుతూ ఆ దేశ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను పెంచింది. జూన్ నెలలో జరిగిన రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన సమీక్ష సమావేశం మినట్స్ బుధవారం స్టాక్ మార్కెట్ పనివేళలు ముగిసిన తరువాత వెలువడ్డాయి. అధిక చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందనే సంకేతాలను ఈ మినట్స్ ఇచ్చాయి. ఇది కూడా గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) బుధవారం నికరంగా రూ. 1,442.61 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 1,473.65 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ గురువారం కూడా పెరిగింది. 1.22 శాతం పెరిగిన ఈ షేర్ ధర సరికొత్త గరిష్ట స్థాయి రూ. 1,032.35కు చేరింది. ఇండెక్స్‌లోని లాభపడిన ఇతర సంస్థలలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. మరోవైపు, సెనె్సక్స్ ప్యాక్‌లోని ఎంఅండ్‌ఎం అత్యధికంగా 2.11 శాతం నష్టపోయింది. నష్టపోయిన ఇతర సంస్థలలో ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్, ఎస్‌బీఐ, సన్ ఫార్మా, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో ఉన్నాయి.