బిజినెస్

త్వరలో కొత్త పారిశ్రామిక విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్న: పారిశ్రామిక రంగంలో ఇటీవలి కాలంలో వచ్చిన ధోరణులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని తేనుంది. భారత్‌ను 2025-26 నాటికి అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఈ నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేయనుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం ఇక్కడ ఈ విషయం చెప్పారు. అంబత్తూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏఐఈఎంఏ) చెన్నైలో ఏర్పాటు చేసిన 13వ అంతర్జాతీయ మెషిన్ టూల్స్ ఎగ్జిబిషన్‌ను సురేశ్ ప్రభు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తయారీ (మాన్యుఫాక్చరింగ్) రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు అనుగుణంగా ఈ నూతన పారిశ్రామిక విధానం ఉంటుందని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో మాన్యుఫాక్చరింగ్ రంగాన్ని ఒక ట్రిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ కొత్త పారిశ్రామిక విధానం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
‘గతంలో రెండుసార్లు 1956, 1992లలో మాత్రమే దేశంకోసం కొత్త పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించారు. సైద్ధాంతిక అంశాలే ప్రధానంగా ఉన్న గత పారిశ్రామిక విధానాల వలె కాకుండా త్వరలో ఆవిష్కరించనున్న కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రధానంగా పారిశ్రామిక రంగం వృద్ధి చెందేందుకు వీలుగా రూపొందించడం జరిగింది’ అని సురేశ్ ప్రభు వెల్లడించారు. మంత్రి చెప్పినదాని ప్రకారం, కృత్రిమ మేథస్సు, రోబోటిక్స్, 3డీ ప్రింటింగ్‌లు మాన్యుఫాక్చరింగ్‌ను పునర్నిర్వచిస్తాయి. ఏ కొత్త పారిశ్రామిక విప్లవం కోసమయితే ప్రపంచం ముందుకు సాగుతోందో, భారత్‌లో ఆ కొత్త పారిశ్రామిక విప్లవానికి బాటలు వేస్తాయి. ‘ఇప్పుడు మనం పారిశ్రామికాభివృద్ధికి మెరుగయిన వౌలిక సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉంది’ అని మంత్రి సురేశ్ ప్రభు అన్నారు.