బిజినెస్

అత్యంత రద్దీ రూటు దుబాయ్-ముంబయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: దుబాయ్-ముంబయి అంతర్జాతీయ విమానయాన మార్గానికి అత్యంత రద్దీ కలిగినదిగా గుర్తింపు లభించింది. విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల మేరకు 2017-18 సంవత్సరంలో ఈ మార్గంలో దాదాపు 2.5 మిలియన్ల మంది వలసదారులు ప్రయాణించి రికార్డు సృష్టించారు. భారత్ నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే అత్యంత రద్దీ కలిగిన 10 అంతర్జాతీయ విమానయాన మార్గాల్లో మొదటిదిగా ఈ రూటు గుర్తింపు పొందింది. యునైటెడ్ అరబ్ కమిరేట్స్ వివరాల ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి విదేశాలకు ప్రయాణించినవారిలో దాదాపు సగం మంది ముంబయి-దుబాయ్ మార్గంలో ప్రయాణించారు. అలాగే ఢిల్లీ-దుబాయ్ రూటులో దాదాపు 2 మిలియన్ల మంది ప్రయాణించి తర్వాతి స్థానంలో నిలవగా, ఒక మిలియన్ మంది ప్రయాణికులతో దుబాయ్-కోచి మార్గం మూడో స్థానాన్ని సంపాదించింది.
ఢిల్లీ-బ్యాంకాక్ మార్గంలోనూ దాదాపు మిలియన్ మంది ప్రయాణించారు. అలాగే ఢిల్లీ-హైదరాబాద్ రూట్ ఐదవ స్థానంలో, ఢిల్లీ-లండన్ రూటు ఆరు, లండన్-ముంబయి రూటు ఏడు, దుబాయ్-చెన్నై రూట్ ఎనిమిది, సింగపూర్-చెన్నై, కొలంబో-చెన్నై ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. అదే ఏడాదిలో ఇక డొమెస్టిక్ రూట్లలో ముంబయి-్ఢల్లీ మార్గం ఆసియా పసిఫిక్ రీజియన్‌లోనే అత్యంత రద్దీ కలిగిన మార్గంగా గుర్తింపు పొందింది. ఢిల్లీ-బెంగళూరు, బెంగళూరు-ముంబయి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.