బిజినెస్

ఐదో వారమూ లాభాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 23: ఈ వారం చివరి సెషన్‌లో వచ్చిన ర్యాలీతో వరుసగా అయిదో వారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ స్వల్పంగా 67.46 పాయింట్లు పుంజుకొని, 35,689.60 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 4.15 పాయింట్లు పెరిగి 10,821.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. అమెరికా, చైనాల మధ్య తాజా వాణిజ్య వివాదాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ఈ వారంలో ప్రతికూల ప్రభావం చూపించాయి. మొత్తం మీద మార్కెట్ కీలక సూచీలు ఈ వారంలో ఊగిసలాట మధ్య సాగాయి. ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలయిన అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి దారితీశాయి. దీని ప్రతికూల ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైనా పడింది. దీంతో పాటు రూపాయి బలహీనపడటం, భారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఫండ్‌ల నిరంతరాయ పెట్టుబడుల ఉపసంహరణ, జూన్ నెలలో జరిగిన రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన సమీక్షలో ద్రవ్యోల్బణం పెరగనుందనే సంకేతాలు వెలువడటం, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలకు ప్రతీకార చర్యగా యూరోపియన్ యూనియన్, చైనాల బాటలో భారత్ కూడా అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను పెంచింది. అయితే ఈ వారం చివరి సెషన్ అయిన శుక్రవారం మధ్యాహ్నం తరువాత ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్ షేర్లను కొనుగోలు చేయడానికి మదుపరులు ఉత్సాహం చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ వచ్చింది. ఫలితంగా ఈ వారం మార్కెట్లు నష్టపోకుండా స్వల్ప లాభాలతో ముగియగలిగాయి.
సెనె్సక్స్ ఈ వారం 35,698.43 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, 35,741.28- 35,249.06 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 67.46 పాయింట్ల (0.19 శాతం) పైన 35,689.60 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం నాలుగు వారాలలో కలిసి 773.84 పాయింట్లు (2.22 శాతం) పుంజుకుంది. నిఫ్టీ ఈ వారం 10,830.20 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, 10,837- 10,701.20 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే నామమాత్రంగా 4.15 పాయింట్లు (0.04 శాతం) పెరిగి 10,821.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ షేర్లు మాత్రమే ఈ వారంలో లాభపడ్డాయి. లోహ, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, టెక్నాలజి, కన్స్యూమర్ డ్యూరేబుల్స్, పీఎస్‌యూలు, స్థిరాస్తి, ఎఫ్‌ఎంసీజీ, ఐపీఓలు, వాహన, పవర్, చమురు- సహజ వాయువు, ఆరోగ్య సంరక్షణ రంగాల షేర్లు నష్టపోయాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా ఈ వారంలో పడిపోయాయి. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) ఈ వారంలో నికరంగా రూ. 4,227.94 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.