బిజినెస్

ఎస్‌బీఐ కొత్త ఎండీగా ఆర్జిత్ బసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా అర్జిత్ బసును కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇంతకాలం బ్యాంకు ఎండిగా ఉన్న రజనీష్ కుమార్ చైర్మన్‌గా పదోన్నతి లభించడంతో ఆ పోస్టులో ఆర్జిత్ బసును నియమించారు. ఎస్‌బీఐ చట్టం ప్రకారం ఎస్‌బీఐకు నలుగురు ఎండీలను నియమించవచ్చును. పదోన్నతి కంటే ముందు ఆర్జిత్ బసు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలు అందించారు. 2020 అక్టోబర్ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో ఆయన ఎస్‌బీఐ జీవిత బీమా సంస్థ ఎండిగా పనిచేశారు. 1983లో ఆయన ఎస్‌బీఐలో ప్రొబాషనరీ ఆఫీసర్‌గా చేరారు. ఎకనామిక్స్‌లో డిగ్రీ, హిస్టరీలో పిజి డిగ్రీలను పూర్తి చేశారు. ఎస్‌బీఐలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. టోక్యో బ్రాంచిలో కూడా విశిష్ట సేవలు అందించారు. కాగా అనిల్ కిషోర్‌ను డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ రిస్క్ ఆఫీసర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన 2020 మే వరకు ఆ పదవిలో కొనసాగుతారు.