బిజినెస్

రూ. 2.8 కోట్లు తగ్గిన జైట్లీ సంపద!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తిగత ఆస్తులు గత ఆర్థిక సంవత్సరం (2015-16) 2.8 కోట్ల రూపాయలు క్షీణించాయి. 2015 మార్చి 31కి 71.95 కోట్ల రూపాయలుగా ఉన్న జైట్లీ సంపద.. 2016 మార్చి 31కి 69.13 కోట్ల రూపాయలకు వచ్చింది. ఈ మేరకు 2015-16కుగాను తాజాగా విడుదల చేసిన వ్యక్తిగత వార్షిక ఆస్తులు, అప్పుల ప్రకటనలో జైట్లీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇలా వివరాలను అందించిన తొలి కేంద్ర మంత్రిగా జైట్లీ నిలిచారు. ఇక తనకు ఢిల్లీలో మూడు నివాసాలున్నాయని, హర్యానా, గుజరాత్, పంజాబ్‌లలో ఒక్కొక్కటి ఉన్నాయని, ఫరీదాబాద్‌లో 3,600 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్లాట్, గుర్గావ్‌లో 5,453 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న వాణిజ్యపరమైన ఆస్తి ఉందని చెప్పారు. మొత్తంగా తన స్థిరాస్తుల విలువ 35.21 కోట్ల రూపాయలుగా ఉందన్నారు. ఇతర సంస్థల్లోని డిపాజిట్ల విలువ కూడా 17 కోట్ల రూపాయలుగా యథాతథంగానే ఉంది. అయితే గతంతో పోల్చితే ఇందులో ఎలాంటి మార్పూ లేదు. కానీ నిరుడుతో పోల్చితే ఒక ఎస్‌బిఐ, మూడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వలు మాత్రం 3.52 కోట్ల రూపాయల నుంచి కోటీ రూపాయలకు పడిపోయిందని తెలిపారు. అలాగే పిపిఎఫ్, ఇతర పెట్టుబడుల విలువ కూడా 11.24 కోట్ల రూపాయల నుంచి 11 కోట్ల రూపాయలకు దిగజారింది. కార్ల విలువ కూడా 2.79 కోట్ల రూపాయల నుంచి 1.93 కోట్ల రూపాయలకు తగ్గింది. అయితే పెరిగిన బంగారం ధరల నేపథ్యంలో నగల విలువ 1.76 కోట్ల రూపాయల నుంచి 1.86 కోట్ల రూపాయలకు పెరిగినట్లు జైట్లీ పేర్కొన్నారు. ఈ వివరాలన్నీ కూడా తనవి, తన భార్యవి కలిపినవని చెప్పారు. అప్పుల విషయానికొస్తే జైట్లీ సతీమణి సంగీత రుణభారం 9.71 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, ఈసారి కార్లలో బిఎమ్‌డబ్ల్యు కారును జైట్లీ పేర్కోలేదు.