బిజినెస్

బులియన్ మార్కెట్‌లో ‘సిల్వర్’ మారథాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: బులియన్ మార్కెట్‌లో వెండి వెలుగులు విరజిమ్ముతున్నాయి. శనివారం ఒక్కరోజే కిలో వెండి ధర 960 రూపాయలు ఎగిసిపడగా, వారం రోజుల్లో 3,170 రూపాయలు పెరిగి కిలో వెల 45 వేల మార్కును అధిగమించి 45,560 రూపాయలను తాకింది. గత నాలుగు రోజులుగా వెండి ధరలు పెరుగుతూనే ఉండగా, శనివారం కూడా అదేతీరు సాగింది. దీంతో రెండేళ్ల గరిష్ఠ స్థాయికి ధర చేరింది. ఆగస్టు 2014 తర్వాత మళ్లీ ఈ స్థాయికి వెండి ధరలు రావడం ఇదే తొలిసారి. కాగా, వెండి ధరలు పెరగడానికి కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న డిమాండేనని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగిన (బ్రెగ్జిట్) నేపథ్యంలో తలెత్తిన విపత్కర పరిణామాల మధ్య ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల సెంట్రల్ బ్యాం కులు తమ ఆర్థిక వ్యవస్థల బలోపేతం కోసం ఉద్దీపనలు ప్రకటించే వీలుందన్న ఊహాగానాలే ఇందుకు కారణమని వ్యాపారులు విశే్లషిస్తున్నారు. ఈ క్రమంలోనే పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ ఏర్పడిందని అంటున్నారు. దీంతో కొనుగోళ్లు పెరిగాయని పేర్కొంటున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 5.2 శాతం ఎగబాకి 19.58 డాలర్లు పలికింది. మరోవైపు దేశీయంగా బంగా రం ధర మాత్రం శనివారం యథాతథంగా ఉండిపోయింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం ఔన్సు ధర 1.4 శాతం ఎగిసి 1,339 డాలర్లయ్యింది.