బిజినెస్

ఐ కంట్రోల్ స్మార్ట్ఫోన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోస్టన్, జూలై 2: ‘కత్తులతో కాదు.. కంటి చూపుతో చంపేస్తా’ ఓ సూపర్‌హిట్ తెలుగు సినిమాలోని పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్ ఇది. ఇప్పుడు ఈ డైలాగ్ సంగతి ఎందుకు? అనుకుంటున్నారా.. అదే చెబుతున్నాం.. త్వరలో ఓ సరికొత్త టెక్నాలజీ పరిచయం కానుంది. రోజుకో టెక్నాలజీ వస్తోంది అయితే ఏంటి? అనుకోకండి. ఎందుకంటే ఈ టెక్నాలజీతో మీరు మీ స్మార్ట్ఫోన్‌ను కంటి చూపుతోనే కంట్రోల్ చేసేయొచ్చు. ఫోన్లు, మెసేజ్‌లు, వాట్సాప్, స్కైప్, ఫేస్‌బుక్, ఆడియోలు, వీడియోలు ఏదైనా సరే ఫోన్‌ను తాకకుండా చూస్తూనే వాడేయవచ్చు. అవునా.. అని ఆశ్చర్యపోతున్నారా? నిజంగా ఇది నిజమండి. పరిశోధనలు సఫలమైతే రేపు మీ చేతిలోనూ ‘ఐ కంట్రోల్ స్మార్ట్ఫోన్’ ఉండొచ్చు. ఓ అంతర్జాతీయ శాస్తవ్రేత్తల బృందం ఇందుకు కావాల్సిన సరికొత్త మొబైల్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో ఒక భారత సంతతి శాస్తవ్రేత్త కూడా ఉన్నారు. ఈ బృందం రూపొందిస్తున్న సాఫ్ట్‌వేర్ మనిషి చూపును ఖచ్ఛితంగా పసిగట్టగలదు. ఎక్కడ చూస్తున్నాడన్నది ఏమాత్రం తేడా లేకుండా గుర్తించగలదు. కంటిపాప కదలికల గురించిన సమాచారం స్పష్టంగా ఇవ్వగలదు. దీంతో ఈ సాఫ్ట్‌వేర్ ఆధారంగా స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు ఇతర మొబైల్ డివైస్‌లను ఆపరేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా శాస్తవ్రేత్తలు ముమ్మరంగా పరిశోధనలు జరుపుతున్నారు. జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇన్ఫర్‌మాటిక్స్, అమెరికాలోని జార్జియా విశ్వవిద్యాలయం, మస్సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్‌ఐటి) పరిశోధకులు ఈ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేస్తున్నారు. స్మార్ట్ఫోన్ స్క్రీన్‌పై కనిపించే ఆప్షన్లలో కావాల్సినదాని వైపు చూస్తే చాలు ఆ ఆప్షన్ తెరుచుకునేలా ఈ సాఫ్ట్‌వేర్‌తో ప్రయత్నిస్తున్నారు. మొబైల్ ఫోన్‌పై సెంటీమీటర్ తేడాతో కంటి చూపును పసిగట్టడం, టాబ్లెట్‌పై 1.7 సెంటీమీటర్ల తేడాతో కంటి పాప కదలికలను గుర్తించడంలో శాస్తవ్రేత్తలు ఈ సాఫ్ట్‌వేర్‌తో ఇప్పటికే విజయాలు అందుకున్నారు. అయితే మరింత నిర్దిష్టమైన ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులోభాగంగానే మొబైల్ వినియోగదారులు స్మార్ట్ఫోన్ స్క్రీన్‌ను ఏ పరిస్థితుల్లో ఎలా చూస్తున్నారు? ఎంత దూరం నుంచి చూడగలుగుతున్నారు? అన్నదానిపై శాస్తవ్రేత్తలు ఓ యాప్ ద్వారా అధ్యయనం కూడా చేస్తున్నారు. దాదాపు 1,500 మంది ఈ యాప్‌ను ఇప్పటిదాకా వాడారని ఎమ్‌ఐటి గ్రాడ్యుయేట్ విద్యార్థి ఆదిత్యా ఖోస్లా తెలిపారు. 10 వేల మంది నుంచి డేటాను అందుకోగలిగితే సాఫ్ట్‌వేర్‌ను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దవచ్చని, సెంటీమీటర్ నుంచి అర సెంటీమీటర్ పరిధిలోకి తేవచ్చని అన్నారు. నిపుణులు కూడా ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే సంచలనాలు ఖాయమంటున్నారు. ఇప్పుడున్న టచ్ స్క్రీన్ మొబైల్స్‌ను అధిగమించి అమ్మకాలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు వినియో గంలో ఉన్న కీప్యాడ్ సెల్‌ఫోన్లు.. రాన్రాను టచ్ స్క్రీన్ స్మార్ట్ఫోన్లుగా మారాయ. ప్రస్తుతం శాస్తవ్రేత్తల కృషి ఫలిస్తే.. ఇకపై వీటి స్థానంలో ఐ కంట్రోల్ స్క్రీన్‌లు రావడం ఖాయంగా కనిపిస్తోంది కదూ..