బిజినెస్

చట్టపరమైన ప్రక్రియ పూర్తి కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డీఓటీ) చట్టబద్ధమయిన ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే ప్రభుత్వం దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఐడియా- వొడాఫోన్ విలీన ఒప్పందాన్ని ఆమోదిస్తుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా మంగళవారం తెలిపారు. ‘డీఓటీ విలీనాలు, స్వాధీనాలకు సంబంధించి నియమాలను రూపొందించింది. డీఓటీ చట్టబద్ధమయిన ప్రక్రియను అంతా పూర్తి చేసిన తరువాత ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఐడియా-వొడాఫోన్ విలీనాన్ని ఆమోదించడం జరుగుతుంది’ అని సిన్హా ఐఐటీ ఢిల్లీలో ఎరిక్సన్‌కు చెందిన 5జీ టెస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించిన సందర్భంగా విడిగా విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. ఐడియా- వొడాఫోన్ విలీనం వల్ల కొత్తగా దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీ ఏర్పడుతుంది. 2018 జూన్ 30 నాటికే ఈ విలీన ఒప్పందం పూర్తవుతుందని ఐడియా, వొడాఫోన్ భావించాయి. జూన్ నెల మధ్య నాటికే ఈ విలీన ఒప్పందానికి ఆమోదం లభిస్తుందని భావించాయి. అయితే, టెలికం డిపార్ట్‌మెంట్ ఈ విలీన ఒప్పందాన్ని ఆమోదించడానికి ముందు వొడాఫోన్ నుంచి తాజా డిమాండ్ మొత్తాన్ని రూ. 4,700 కోట్లకు పెంచాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2015లో వొడాఫోన్ తన నాలుగు అనుబంధ సంస్థలయిన వొడాఫోన్ ఈస్ట్, వొడాఫోన్ సౌత్, వొడాఫోన్ సెల్యులార్, వొడాఫోన్ డిజిలింక్‌లను వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్‌లో విలీనం చేసింది. ఈ వొడాఫోన్ సర్వీసెస్‌నే ఇప్పుడు వొడాఫోన్ ఇండియాగా పిలుస్తున్నారు. డీవోటీ ఆ సమయంలో రూ. 6,678 కోట్ల ఓటీఎస్‌సీ బకాయిలను చెల్లించాల్సిందిగా వొడాఫోన్‌ను ఆదేశించింది. అయితే, డీఓటీ జారీ చేసిన ఈ ఆదేశాలను వొడాఫోన్ న్యాయస్థానంలో సవాలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, వొడాఫోన్ విలీన ఒప్పందం ఆమోదం కోసం రూ. 2,000 కోట్లు చెల్లించింది. ఈ నేపథ్యంలో ఐడియా సెల్యులార్‌తో విలీనానికి ముందే బకాయి ఉన్న మిగతా మొత్తాన్ని చెల్లించాల్సిందిగా డీఓటీ ఇప్పుడు వొడాఫోన్‌ను అడుగుతోంది.