బిజినెస్

ఎక్కువ ‘వడ్డీ’తో కుచ్చుటోపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుబోలు, జూలై 3: ఎక్కువ వడ్డీ ఆశ చూపి గ్రామస్తుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసిన ఒక వ్యాపారి కుటుంబంతో సహా ఉడాయించిన సంఘటన ఇది. అందరినీ నమ్మించి సుమారు ఐదుకోట్ల రూపాయలతో కుటుంబ సమేతంగా వారంరోజుల కిందట గ్రామం నుంచి మాయమైన సంఘటన నెల్లూరు జిల్లా మనుబోలు మండల పరిధిలోని కొలనుకుదురు గ్రామంలో చోటుచేసుకుంది. తమ నుంచి డబ్బు తీసుకున్న వ్యక్తి మూడురోజుల నుంచి కనబడకపోవటంతో డబ్బులు ఇచ్చిన వ్యక్తులు అనుమానంతో గూడూరు డీఎస్పీ రాంబాబుకు మంగళవారం ఫిర్యాదు చేశారు. బాధితుల తెలిపిన సమాచారం ప్రకారం మండల పరిధిలోని కొలనుకుదురు గ్రామానికి చెందిన వేల్చూరి గాంధీ కుటుంబం చిన్న దుకాణంతోపాటు సుమారు 20 ఎకరాలలో రొయ్యల చెరువులు సాగుచేస్తున్నాడు. గాంధీకి భార్య, ఇద్దరు కుమారులు, కోడళ్లు, మనుమరాళ్లతో ఇక్కడ నివాసం ఉన్నాడు. గాంధీ ఇటీవల అనారోగ్యానికి గురవటంతో కుమారులు సుబ్బారావు, మురళి రొయ్యలసాగు, దుకాణం చూసుకుంటున్నారు. వీటితోపాటు గ్రామంలో రైతులు, బడుగుజీవుల నుంచి, ఇతర ప్రాంతాల ప్రజల నుంచి రెండు రూపాయల వంతున వడ్డీకి అప్పులు తీసుకుని బయట అధికవడ్డీకి మార్చుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. కొంతకాలం రుణదాతలు అడిగిన వెంటనే అప్పు తిరిగి ఇచ్చివేస్తూ అందరనీ నమ్మించారు. దీంతో తమవద్ద దాచుకున్న సొమ్మును గ్రామంలో అనేకమంది రైతులు అప్పులు ఇవ్వడం మొదలుపెట్టారు. వీరినుంచే కాకుండా గూడూరు, నెల్లూరు, కోవూరు, చెన్నై తదితర ప్రాంతాల వ్యక్తుల నుంచి కూడా సుమారు ఐదుకోట్లకు పైగా అప్పులు తీసుకున్నారు. ఒక కొలనుకుదురు గ్రామంలోనే రూ.1.50కోట్లుకు పైగా అప్పులు తీసుకున్నట్లు బాధితులు తెలిపారు. జనాల నుంచి తీసుకున్న డబ్బుకు గాంధీ కుమారుడు మురళి నోట్లు రాసిచ్చేవాడు. ఇరవై రోజుల కిందట రొయ్యలు పట్టటంతో రూ.20లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. అనంతరం రొయ్యల గుంటల వద్ద ఏరియేటర్లును రూ.8లక్షలకు అమ్మివేశాడు. దీనిపై గ్రామస్తుల ప్రశ్నిస్తే కొందరికి కొత్తవి కొనుగోలు చేస్తున్నామని, మరికొందరికి బంధువులకు లీజుకు ఇస్తున్నామంటూ నమ్మబలికారు. ఈ మొత్తం డబ్బుతో గూడూరులో ఒక బ్యాంకులో కుటుంబ సభ్యుల పేరుతో తాకట్టు పెట్టిన బంగారు నగలను విడిపించుకున్నారు. కిరాణ దుకాణంలో ఉన్న సరుకులను బద్దెవోలు గ్రామంలోని బంధువుల ఇంటికి తరలించారు. అనంతరం గత వారం రోజుల కిందట ఇంట్లోని విలువైన వస్తువులు తీసుకుని చుట్టుపక్కల వారికి శ్రీశైలం తీర్థయాత్రకు వెళ్తున్నామని నమ్మించి ఉడాయించారు. గ్రామానికి చెందిన ఒక బాధితుడు తనకు ఇవ్వవలసిన మొత్తం డబ్బు కోసం సుబ్బారావుకు ఫోన్ చేయగా తనకు అప్పుతో ఎటువంటి సంబంధం లేదని, మురళి ఎక్కడున్నాడో తనకు తెలియదని సమాధానం చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. విషయం తెలిసి బాధితులందరూ కలిసి మంగళవారం గూడూరు డీఎస్పీ రాంబాబుకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. గాంధీ కుటుంబానికి శ్రీకాళహస్తిలో సుమారు రూ.80లక్షల రూపాయలు విలువచేసే ఆస్తులు ఉన్నాయని, వీటితోపాటు కాగితాలపూరుకు సమీపంలో రెండున్నర ఏకరాల భూమి ఉందని డీఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.