బిజినెస్

ఎగుమతుల్లో 20శాతం వృద్ధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: దేశం నుంచి ఎగుమతులు జూన్ నెలలో సుమారు 20 శాతం వృద్ధి చెంది ఉంటాయని తాను అంచనా వేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. మే నెలలో ఎగుమతులు 20 శాతానికి పైగా వృద్ధి చెందాయని, అదే రీతిలో జూన్ నెలలోనూ వృద్ధి చెందుతాయని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. భారతదేశ ఎగుమతులకు మరో వంద బిలియన్ డాలర్ల విలువ గల ఎగుమతులను జోడించడానికి రూపొందించాల్సిన వ్యూహంపై మంత్రి బుధవారం ఎగుమతిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. జూన్ నెల ఎగుమతులకు సంబంధించిన అధికార గణాంకాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ నెల 15న వెల్లడించనుంది. బ్యాంకులు రుణాల మంజూరులో ఎగుమతిదారులను ప్రాధాన్యతా రంగంలోకి తీసుకొని రుణాలు ఇవ్వాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. బ్యాంకులు ఇలా చేసినప్పుడే ఎగుమతిదారులు రుణాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోబోరని అన్నారు. ప్రభుత్వం ఎగుమతులకు ఊతమివ్వడానికి తగిన రీతిలో మద్దతు అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య స్థాయిలో వీస్తున్న ఎదురుగాలులు భారత్‌ను ప్రభావితం చేయబోవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత్ ఎగుమతులు మే నెలలో 20.18 శాతం వృద్ధితో 28.86 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంటే గత ఆరు నెలల కాలంలో గరిష్ఠ స్థాయిలో వృద్ధి చెందాయి. గతంలో 2017 నవంబర్‌లో అత్యధిక వృద్ధి రేటు 30.55 శాతంతో ఎగుమతులు పెరిగాయి.