బిజినెస్

హైవే ప్రాజెక్టులకు మరిన్ని రుణాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్ర, ఇండస్‌ఇండ్, యెస్ బ్యాంక్, ఆర్‌బీఎల్ వంటి ప్రైవేటు బ్యాంక్‌లు పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో చేపట్టిన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు మరింత ఆర్థిక సాయం చేయడానికి ఆసక్తి కనబరిచాయి. హైబ్రిడ్ ఆన్యుటి మోడల్ (హెచ్‌ఏఎం) కింద నిర్వహించే ప్రాజెక్టులకు రుణాలు అందజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అగ్ర శ్రేణి ప్రైవేటు బ్యాంకుల ఎగ్జిక్యూటివ్‌లు గత వారం కేంద్ర హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హెచ్‌ఏఎం కింద చేపట్టే ప్రాజెక్టులలో రిస్క్‌ను ఎక్కువగా ప్రభుత్వమే భరిస్తుంది. 2017-18 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో చేపట్టిన 56 ప్రాజెక్టులలో కనీసం 20 ప్రాజెక్టులకు రుణాలు అందజేయడానికి ప్రైవేటు బ్యాంకులు అంగీకరించాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌బీఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ హైవే సెక్టార్‌లోని కొన్ని హెచ్‌ఏఎం ప్రాజెక్టులకు రుణాలు అందజేశాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టులకు రుణాలు అందించే బ్యాంకుల సంఖ్య పెరుగుతోంది. గతంలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మాత్రమే హైవే డెవలపర్లకు పరిమిత స్థాయిలో రుణాలు అందజేస్తుండేవి.