బిజినెస్

స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల సంపద!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: నల్లధనానికి అసలుసిసలు చిరునామాగా నిలిచే స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల సంపద తగ్గిపోతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. తాజా గణాంకాల ప్రకారం స్విస్ బ్యాంకుల్లో సొమ్మున్న విదేశీయుల జాబితాలో భారత్ 75వ స్థానానికి పడిపోయింది. నిరుడు 61వ స్థానంలో ఉంది. నిజానికి 2007 వరకు టాప్-50లో ఉన్న భారత్.. 2004లోనైతే 37వ స్థానంలో నిలిచింది. ఇదిలావుంటే స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకైన స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్‌ఎన్‌బి) విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం స్విస్ బ్యాంకుల్లో అధిక సొమ్మున్న దేశస్తుల్లో బ్రిటన్ ప్రథమ స్థానంలో ఉంది. బ్రిటనీయుల సంపద 350 బిలియన్ల స్విస్ ఫ్రాంక్ (సిహెచ్‌ఎఫ్)లుగా నమోదైంది. భారతీయుల సంపద 1.2 బిలియన్ సిహెచ్‌ఎఫ్‌గా ఉంది. ఇకపోతే టాప్-10లో అమెరికా, వెస్టిండీస్, జర్మనీ, బహమాస్, ఫ్రాన్స్, గుర్నెసి, లగ్జెంబర్గ్, హాంకాంగ్, పనామా దేశాలున్నాయి. కాగా, 2015 నాటికి స్విస్ బ్యాంకుల్లోని విదేశీయుల సంపద దాదాపు 98 లక్షల కోట్ల రూపాయలు తగ్గింది.