బిజినెస్

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వరుసగా మూడో రోజు శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.75.98కి చేరింది. అలాగే లీటర్ పెట్రోల్ ధర ముంబయిలో రూ.83.37కు, కోల్‌కతాలో రూ. 78.66కు, చెన్నయ్‌లో రూ. 78.85కు పెరిగింది. లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో శనివారం రూ. 67.76కు పెరిగింది. ముంబయిలో లీటర్ డీజిల్ ధర రూ. 71.90కు, కోల్‌కతాలో రూ. 70.31కు, చెన్నయ్‌లో రూ. 71.52కు పెరిగింది. 36 రోజుల విరామం అనంతరం జూలై 5న ఇంధన ధరలు పెరగడం ప్రారంభం అయింది. అప్పటివరకు వీటి ధరలు తగ్గుతూ వచ్చాయి. శుక్రవారం పెట్రోల్ ధరలు లీటర్‌కు 14-15 పైసల మధ్య, డీజిల్ ధరలు లీటర్‌కు 16-18 పైసల మధ్య పెరిగాయి. అలాగే అంతకు ముందు రోజు అంటే జూలై అయిదో తేదీన నాలుగు మెట్రో నగరాలలో లీటర్ పెట్రోల్ ధర 16-17 పైసల మధ్య, లీటర్ డీజిల్ ధర 10-12 పైసల మధ్య పెరిగింది. మే 30 నుంచి పెట్రోల్ ధరలు 22సార్లు తగ్గగా, డీజిల్ ధరలు 18సార్లు తగ్గాయి. జూన్ నెలలో 18సార్లు జరిపిన ధరల సవరణ వల్ల ఢిల్లీలో పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ.2.88 తగ్గాయి. డీజిల్ ధరలు లీటర్‌కు రూ.1.93 తగ్గాయి. చివరిసారిగా జూన్ 26న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఆ రోజున లీటర్ పెట్రోల్ ధరలు 14-18 పైసల మధ్య, లీటర్ డీజిల్ ధరలు 10-12 పైసల మధ్య తగ్గాయి. 2010 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలపై తన నియంత్రణను ఎత్తివేసింది. నాలుగేళ్ల తరువాత 2014 అక్టోబర్‌లో డీజిల్ ధరలపైనా తన నియంత్రణను తొలగించింది.