బిజినెస్

మీరివ్వకపోతే... మేమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోమ్, జూలై 7: నోబెల్ అకాడెమీలో ఓ కీలక అధికారిపై అవినీతి, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ అవార్డును ప్రకటించే అవకాశాలకు దాదాపు తెరపడింది. అయితే, ప్రస్తుతం ఉన్న కమిటీ అవార్డును ప్రదానం చేయకపోతే, ఆ బాధ్యతను తాము స్వీకరిస్తామంటూ ఒక కొత్త అకాడెమీ తెరపైకి వచ్చింది. ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రదానం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదని, ఎలాంటి ఆటంకం లేకుండా ఈ ఏడాది కూడా వాటిని అందచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ అకాడెమీ సభ్యులు ప్రకటించారు. స్వీడన్ శాస్తవ్రేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895లో స్థాపించిన అకాడెమీ ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి, బహుమతిని అందచేస్తున్నది. స్వీడన్ రాజు 15వ కార్ల్ గస్ట్ఫా కాలంలో, నోబెల్ ప్రైజ్‌కు అభ్యర్థులను ఎంపిక చేసే కమిటీ నుంచి ఎవరైనా రాజీనామా చేయవచ్చని, వారి స్థానంలో ఇతరులను నియమించవచ్చని సవరణ అమల్లోకి వచ్చింది. అంతకు ముందు వరకూ కమిటీ సభ్యుల్లో ఎవరూ రాజీనామా చేయడానికి వీలుండేది కాదు. ఒక సభ్యుడి మరణానంతరమే ఆ స్థానాన్ని భర్తీ చేసేవారు. ఇలావుంటే, కమిటీలో చాలాకాలంగా కీలక పాత్ర పోషిస్తున్న జర్మనీకి చెందిన ఓ ప్రముఖుడు అవినీతికి పాల్పడుతున్నాడన్న ఆరోపణలు వచ్చాయి. తమను లైంగికంగా వేధించాడని, అత్యాచారం జరిపాడని ఇటీవల 18మంది మహిళలు ఆరోపించడంతో ప్రపంచ వ్యాప్తంగా నిరసలు వెల్లువెత్తాయి.
అకాడెమీలో శాశ్వత కార్యదర్శిగా పని చేస్తున్న సారా డానియస్‌సహా చాలా మంది తమ పదవులకు రాజీనామా చేశారు. దీనితో ఈ ఏడాది నోబెల్ ప్రైజ్‌ను ప్రదానం చేసే అవకాశాలు కనిపించడం లేదు. గత 70 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా, మొట్టమొదటిసారిగా నోబెల్ ప్రైజ్ ప్రదానం నిలిచిపోయే ప్రమాదం ఏర్పడడంతో, కొత్త అకాడెమీ తెరపైకి వచ్చింది. మేధావులు, విద్యావంతులు, కళాకారులు, జర్నలిస్టులు ఒకే వేదికపైకి వచ్చి, నోబెల్ ప్రైజ్ ఈ ఏడాది తాము ప్రదానం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు 107 మంది ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. స్వీడన్ ప్రతిష్ఠను దెబ్బతినకూడదన్న ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇలావుంటే, ఈ కొత్త అకాడెమీ సభ్యులు ఇప్పటికే ప్రజల నుంచి విరాళ రూపంలో 1,13,000 డాలర్లు సేకరించారు. ఈ మొత్తంతోనే డిసెంబర్ 10న అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది అవార్డులు ఇచ్చేదీ లేనిదీ ఆదివారంలోగా తేల్చిచెప్పాలని నోబెల్ అకాడెమీకి గడువు విధించారు.